హ్యాపీ బర్త్ డే ధోని: సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ట్వీట్లు
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని.... పరిచయం అక్కర్లేని పేరు. మిస్టర్ కూల్‌గా మారి, ప్రస్తుతం టీమిండియాకు పెద్ద దిక్కుగా ఉన్న ధోని శుక్రవారం (జులై 7)న తన 36వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ధోని పుట్టినరోజుని పురస్కరించుకుని సహచర ఆటగాళ్లు తమదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న ధోని తన పుట్టినరోజుని అక్కడే భారత జట్టు ఆటగాళ్లతో కలిసి జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ధోని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని పేరు తెచ్చుకున్నాడు.
తన ఆటతీరుతో పాటు మైదానంలో ధోని ప్రవర్తనకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంతేకాదు ఐసీసీ నిర్వహించే మూడు ట్రోఫీలను (ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టీ20, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ) భారత్‌కు అందించిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనియే.
ఐపీఎల్‌లో కూడా ధోని విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోని కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా ధోని నిలబెట్టాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ స్టేజి వరకు ప్రతి సీజన్‌లో ఆడిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఆ క్రెడిట్ మొత్తం ధోనికే దక్కుతుంది.
ధోనికి యువీ శుభాకాంక్షలు
టీమ్‌లోకి వచ్చినప్పటి నుంచీ యువీతో ధోనీకి మంచి స్నేహం ఉంది. అందుకే తన ప్రియ మిత్రుడికి తనదైన స్టైల్లో బర్త్ డే విషెస్ చెప్పాడు యువీ. ధోనీ హెలికాప్టర్ షాట్‌ను గుర్తు చేస్తూ.. హ్యాపీ బర్త్ డే మిస్టర్ హెలికాప్టర్ ఎమ్మెస్ ధోనీ.. కేక్ నీకోసం వెయిట్ చేస్తున్నది అంటూ ట్వీట్ చేశాడు.
సెహ్వాగ్ ఇలా
వీరేంద్ర సెహ్వాగ్ కూడా యువీలాగే ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. హెలికాప్టర్ ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి.. మా గుండెల్లో ల్యాండవుతూ ఉండాలని అతను కోరుకున్నాడు.
మహ్మద్ కైఫ్ ఇలా
మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.
ధోనికి ఆకాశ్ చోప్రా పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆకాశ్ చోప్రా మాత్రం ధోనీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. 2004లో జరిగిన ఓ ఘటన, ధోనీ హెయిర్‌స్టైల్‌పై అతను కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు
ధోని అభిమాని సంఘం ఇలా
ధోని 36వ పుట్టినరోజు సందర్భంగా ధోని అభిమాన సంఘం ఇలా శుభాకాంక్షలు చెప్పింది.
ఓ ధోని అభిమాని ఇలా
ధోని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అతడికి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెబుతున్నారు.
మాజీ కెప్టెన్ కూల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
ధోని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications