
ఐదు వన్డేల సిరిస్‌లో 1-0తో భారత్ ఆధిక్యం
దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సెప్టెంబర్ 21 (గురువారం) జరగనుంది. చెన్నైలో తొలి వన్డే మ్యాచ్ ముగియడంతో రెండో వన్డే కోసం కోహ్లీసేన కోల్‌కతా బయల్దేరింది.

చెన్నై ఎయిర్ పోర్టులో నేలపై ధోని
ఈ సందర్భంగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోల్లో కెప్టెన్ కోహ్లీ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అంతా కూర్చొని మాట్లాడుతుండగా.. వాళ్ల మధ్యలో ధోనీ మాత్రం ఎయిర్‌పోర్ట్ నేలపైనే ఎంచక్కా పడుకున్నాడు.
గాగుల్స్ పెట్టుకుని మరీ
అంతేకాదు తన పక్కనున్నవారితో తనకేమీ సంబంధం లేనట్లు గాగుల్స్ పెట్టుకొని హాయిగా కునుకు తీశాడు. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో 1-0 ఆధిక్యం వచ్చిన తర్వాత ఇలాగే రిలాక్స్ అవుతారు అంటూ బీసీసీఐ ట్విట్టర్‌లో కామెంట్ పోస్టు చేసింది.
ధోని అంటూ స్టేడియం హోరెత్తి పోయింది
ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత చెన్నైలో అడుగుపెట్టిన ధోనికి అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అవుటైన తర్వాత బ్యాటింగ్ చేయడానికి వస్తున్న సమయంలో ధోని... ధోని అంటూ స్టేడియం హోరెత్తి పోయింది. బీసీసీఐ ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్టు చేసింది.


Click it and Unblock the Notifications











