Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PHOTOS: పోలింగ్ స్టేషన్‌లో ధోని, సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు!

MS Dhoni casts his vote in Jharkhand

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జార్ఖండ్‌లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. గురువారం జార్ఖండ్‌లో మూడో విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ధోని తన ఇంటికి సమీపంలోని ఓ పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు.

ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ధోని ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సందర్భంగా పలువురి అభిమానులు ధోనితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి 17 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు.

నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు. ప్రస్తుతం వెస్టిండిస్‌తో స్వదేశంలో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరిస్‌కు కూడా ధోని దూరమయ్యాడు. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగే సిరిస్‌కు ధోని ఎంపికయ్యే అవకాశాలున్నాయి.

Story first published: Thursday, December 12, 2019, 16:01 [IST]
Other articles published on Dec 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+