
టీ20 ప్రపంచకప్ ధోనీ ఆడుతాడు:
తాజాగా మనీష్ వర్ధన్ సింగ్ మైఖేల్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... 'ధోనీలో చాలా క్రికెట్ మిగిలి ఉంది. అతడు టీమిండియా తరపున తిరిగి ఆడుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ఎందుకంటే.. మహీ గొప్ప ఆటగాడు కాబట్టి. ఐపీఎల్ 2020 కోసం ధోనీ చాలా కష్టపడ్డాడు. కానీ.. దురదృష్టవశాత్తు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టోర్నీ వాయిదా పడింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతడు భారత జట్టులో భాగం అవుతాడు. ఆ తర్వాతే మహీ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాడని నేను ఇప్పటికీ నమ్ముతున్నా' అని తెలిపాడు.

సరైన వీడుకోలు ఇవ్వాలి:
'ధోనీ గురించి నాకు బాగా తెలుసు. జట్టు శ్రేయస్సే ఎప్పుడూ కోరుకుంటాడు. అన్నింటికన్నా జట్టే ముఖ్యం అని చెపుతాడు. నువ్ ఇంకా ఆడాలి, క్రికెట్ పిచ్‌పైనే రిటైర్ కావాలని అభ్యర్థించాం. అతను ఒక లెజెండ్. అతనికి సరైన వీడుకోలు ఇవ్వాలి. మ్యాచ్‌లను గెలిచి జట్టుకు సహకరించగల సామర్థ్యం ధోనీలో ఇంకా ఉంది. అదే సమయంలో మేము కూడా అర్ధం చేసుకోవాల్సింది ఒకటి ఉంది, అతడు జట్టుకు భారం కాకూడదని భావిస్తాడు. అది అతని స్వభావం' అని సింగ్ పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడు మనీష్. వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా ధోనీతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ధోనీతో నిరంతరం టచ్‌లోనే ఉంటాడు.

అందరికీ గౌరవం ఇస్తాడు:
ఇక మాజీ కెప్టెన్ వినయంపై మనీష్ వర్ధన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'మహీ భాయ్ చాలా వినయపూర్వకమైన వ్యక్తి. నేలమీద ఎక్కడో పడి ఉన్న ఖాళీ డబ్బాను కూడా తీసి డస్ట్ డబ్బాలో వేస్తాడు. ఎప్పుడూ ప్రజలను పట్ల అమర్యాదగా ప్రవర్తించడు, అందరికీ గౌరవం ఇస్తాడు. అంత పెద్ద ఆటగాడు అయినా ఎప్పుడూ ఇలానే ఉంటాడు. అతడు ఎప్పుడూ తన సహనాన్ని కోల్పోవడాన్ని నేను చూడలేదు. విలేకరుల సమావేశాలలో, మీడియా వ్యక్తులపై కూడా ఎప్పుడూ కోపం చూపించలేదు. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు కొన్ని సార్లు వ్యంగ్యంగా మాట్లాడవచ్చు, అది వేరే విషయం. పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉన్నా.. అతను ఎప్పుడూ ప్రశాంతత కోల్పోడు. అదే అతని గొప్పతనం. అందుకే క్రికెటర్ల నుండి మహీకి గౌరవం లభిస్తుంది' అని సింగ్ చెప్పుకొచ్చాడు.

ప్రశ్నార్ధకంలో మహీ భవిష్యత్:
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2018 తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అతని బోర్డు కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో రిటైర్మెంట్‌పై ఒత్తిడి నెలకొన్నా.. మహీ ఎలాంటి విషయం క్లారిటీ ఇవ్వలేదు. ఇక కరోనా కారణంగా మహీ భవిష్యత్ ప్రశ్నార్ధకంలో పడింది.


Click it and Unblock the Notifications












