ఇక ధోనీ ఫ్రీగా ఆడొచ్చు: విరాట్ కోహ్లీ
న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ ఇక తనకు ఇష్టం వచ్చినట్లుగా, చాలా ప్రీగా ఆడుకోవచ్చునని విరాట్ కోహ్లీ అన్నాడు. తనకు ఇష్టం వచ్చినట్లుగా ఆడుకొని, క్రికెట్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చునని చెప్పాడు.
ఇటీవల ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే, ట్వంటీ 20లకు కోహ్లీని కెప్టెన్‌గా నియమించారు.
ఈ నేపథ్యంలో కోహ్లీ తాజాగా స్పందించాడు. ధోనీ పైన ప్రశంసలు కురిపించాడు. తన కెప్టెన్సీలో ధోనీ హాయిగా ఆటను ఎంజాయ్ చేయవచ్చునని అభిప్రాయపడ్డాడు.

కాగా, భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగిన మహేంద్రసింగ్ ధోని తనను ఎన్నోసార్లు రక్షించాడని కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. కెరీర్ సాంతం ధోని నేతృత్వంలోనే ఆడిన కోహ్లీ 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.
తొలినాళ్లలో నిలకడ లేకపోవడం వల్ల జట్టు నుంచి తొలగించకుండా చాలాసార్లు తనను రక్షించాడన్నాడు. ధోని నుంచి తీసుకొన్న బాధ్యతలు నిర్వర్తించడం అనుకున్నంత సులువేమీ కాదన్నాడు. ధోని అంటే ముందుగా గుర్తొచ్చేది కెప్టెనేననీ అతడిని మరోలా గుర్తించలేమన్నాడు. ధోని ఎప్పటికీ తనకు సారథేనని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications