హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని తన సొంత రాష్ట్రం జార్ఖండ్ నుంచి మకాంను ముంబైకి మార్చారు. ముంబైలోని అంధేరి ప్రాంతంలోని హౌజింగ్ సొసైటీలో నాలుగు ఫ్లాట్స్‌ను ధోని కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ముంబై మిర్రర్ కథనం ప్రకారం సొసైటీలో కొనుగోలు చేస్తున్న ఇళ్లలోకి ఆయన కుటుంబసభ్యులతో కలిసి ముంబైకి మకాంను మార్చనున్నట్లు పేర్కొంది. ధోని తన మకాంను హౌజింగ్ సొసైటీకి మార్చడంతో అక్కడి స్థానిక బ్రోకర్లు ఆ సొసైటీని 'ధోని వాలీ'గా మార్చారు.
ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు విపుల్ షా, చిత్రాన్ గదాసింగ్, ప్రాచి దేశాయ్, ప్రభు దేవా వంటి పలువురు ఇళ్లకి దగ్గర్లో ధోని ఈ ఫ్లాట్‌లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని జార్ఖండ్‌లోని రాంచిలో హర్ము హౌజింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
భయం లేకుండా ఆడతాడు: ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై యువరాజ్
ఇటీవలే పరిమిత ఓవర్ల కెప్టన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ధోని సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇండియా, ఇంగ్లాండ్ వన్డే సిరిస్‌కు ముందు సన్నాహాకంగా నిర్వహించిన తొలి వార్మప్ మ్యాచ్‌కు ధోని కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలసిందే.

ధోని వీడ్కోలు మ్యాచ్‌గా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఓడినప్పటికీ, గతంలో మాదిరిగానే తన వ్యూహాలతో ధోని మరోసారి ఆకట్టుకున్నాడు. భారత ఏతో మంగళవారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
ధోని కెప్టెన్ కాదు కాబట్టే యువీకి చోటు: తండ్రి యోగిరాజ్ సంచలనం
సెంచరీ మార్కు చేరుకోగానే రాయుడు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఆ తర్వాత యువీకి ధోనీ జతకలిశాడు. అయితే అర్ధ సెంచరీ పూర్తవగానే యువరాజ్ సింగ్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేశాడు.
40 బంతులను ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 68 నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ డౌకట్ అయినా హార్దిక్ (4 నాటౌట్)తో కలిసి ధోనీ స్కోరు 300 పరుగులు దాటించాడు. ధోని చెలరేగి ఆడాడు. వోక్స్ వేసిన ఆఖరి ఓవర్‌లో ధోనీ రెండు భారీ సిక్సర్లతో సూపర్ ఫినిషింగ్ ఇవ్వడంతో భారత్ 304 పరుగులు చేసింది.