ఈడెన్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్: ఛత్తీస్‌గఢ్‌పై విజయం
హైదరాబాద్: దేశవాళీ క్రికెట్ టోర్నీలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విజయ్ హాజారే టోర్నీలో భాగంగా జార్ఖండ్ తరుపున బరిలోకి దిగిన ధోని 107 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులతో 129 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. దీంతో గ్రూప్ 'డి'లో జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జార్ఖండ్ 14.4 ఓవర్లలో 43 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తనదైన శైలిలో విజృంభించాడు. షాబాజ్ నదీమ్ (53)తో కలిసి ఏడో వికెట్‌కు ధోని 151 పరుగులు జోడించాడు.

ఒక ఓవర్‌లో 23 పరుగులు రాబట్టిన ధోని
ఆఫ్ స్పిన్నర్ సాహిల్ గుప్తా వేసిన ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో ధోని 23 పరుగులు రాబట్టడం విశేషం. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్ ఎక్స్‌ట్రా కవర్‌లో కైఫ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కెప్టెన్ ఆ వెంటనే లిస్ట్ ‘ఎ' క్రికెట్‌లో 17వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇన్నింగ్స్‌లో చివరి బంతికి ధోని అవుట్
ఇన్నింగ్స్‌లో చివరి బంతికి ధోని అవుటయ్యాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. దేశవాళీ వన్డేల్లో 2004లో బీహార్ తరఫున శతకం సాధించిన ధోని జార్ఖండ్ తరఫున సెంచరీ చేయడం ఇదే తొలిసారి.

ఛత్తీస్‌గఢ్ 38.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్ 38.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో వరుణ్ ఆరోన్ (3/26), నదీమ్ (3/36) చెలరేగారు. జార్ఖండ్ 78 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై విజయం సాధించింది.

జార్ఖండ్ జట్టుకు ధోని కెప్టెన్‌గా తొలిసారి
విజయ్ హాజారే ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు తొలిసారిగా ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ ఆరంభం కానున్న నేపథ్యంలో ప్రాక్టీస్‌గా కూడా ఉపయోగపడుతుందని ధోని ఈ టోర్నీ ఆడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications