ధోనితో కోహ్లీ 'బిత్తర' సెల్ఫీ: సాక్షి షేర్ చేసిన ఫోటోలు ఇవే
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురువారం 36వ పుట్టిన రోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన సహచర క్రికెటర్లతో పాటు మాజీలు పలువురు ధోనికి శుభాకాంక్షలు చెప్పారు. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
ధోని బస చేసిన హోటల్లో పుట్టినరోజు వేడుకలు
ఈ క్రమంలో ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న ధోని పుట్టినరోజుని భారత జట్టు ఆటగాళ్లు జట్టు బస చేసిన హోటల్లోనే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధోని తన 36వ పుట్టినరోజుని భార్య సాక్షితో పాటు జట్టు సభ్యులతో కలిసి జరుపుకున్నారు. జట్టులోని ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.
ధోని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సాక్షి
ధోని పుట్టినరోజు వేడుకల్లో భార్య సాక్షి, కుమార్తె జీవా కూడా కింగ్‌స్టన్‌లోనే ఉండటం విశేషం. దీంతో ధోనీ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను సాక్షి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. వీటితో పాటు కుమార్తె జీవాతో కలిసి ధోనీ ఓ పార్కులో సరదాగా నడిచే ఫొటోను ఉంచి ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న ధోని
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరోవైపు జట్టులోని సహచర ఆటగాళ్ల సమక్షంలో ధోని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా జట్టులోని సహచర ఆటగాళ్లు ధోనితో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ధోనితో కోహ్లీతో ఓ బిత్తర సెల్ఫీ దిగాడు.
రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్‌లో
ఇందుకు సంబంధించిన వీడియోను రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. భారత్-వెస్టిండీస్ మధ్య ఏకైక టీ20 ఆదివారం కింగ్‌స్టన్‌లో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications