'ధోనీ చెప్పాడనే నా చేతికిచ్చారు'


న్యూ ఢిల్లీ: ట్రోఫీ గెలిచిన తర్వాత ఎప్పుడైనా కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ కప్‌ను పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తుంటారు. కానీ, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కెప్టెన్సీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. జట్టు మొత్తానికి కప్ అప్పగించేసి ధోనీ పక్కన ఉంటాడంతే. ధోని కుర్రాళ్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈ విషయంలో అతను మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు.

ఖలీల్ అహ్మద్ చేతుల్లో ట్రోఫీ
ఇప్పుడు ధోనీ కెప్టెన్ కాకపోయినా అతని మాటే నడుస్తోంది మ్యాచ్‌లో అయినా మైదానంలోనైనా.. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-బంగ్లాదేశ్‌తో తలపడింది. యూఏఈలో భారత జట్టు ఆసియా కప్ గెలిచిన సందర్భంగా సంబరాల సమయంలో కొత్త కుర్రాడు ఖలీల్ అహ్మద్ చేతుల్లో ట్రోఫీ ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ధోని సూచన మేరకే రోహిత్ శర్మ అతడి చేతికి ట్రోఫీ ఇప్పించాడట. ఆ విషయాన్ని ఖలీలే స్వయంగా వెల్లడించాడు.

చేతికి ఇవ్వమని కెప్టెన్ రోహిత్‌కు ధోనీనే
‘వేదిక మీద ట్రోఫీ నా చేతికి ఇవ్వమని కెప్టెన్ రోహిత్‌కు ధోనీనే చెప్పాడు. ఇదే నాకు అరంగేట్ర సిరీస్. జట్టులో అందరి కంటే జూనియర్ నేనే కావడంతో ట్రోఫీ నా చేతికి ఇప్పించాడు. అది నాకు మరపురాని అనుభవం' అని ఖలీల్ చెప్పాడు. వన్డేల్లో అరంగ్రేటం చేసిన 20 ఏళ్ల ఖలీల్ అహ్మద్.. రాజస్థాన్‌కు చెందిన ఖలీల్ హాంకాంగ్ మ్యాచ్‌తో అరంగ్రేటం చేసి పది ఓవర్లలో 48/3 స్కోరు చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పీడ్‌స్టర్ అయిన ఖలీల్ ప్రధాన వికెట్ అయిన ఓపెనర్ నిజాకత్ ఖాన్‌ను అవుట్ చేశాడు.

భారత విజయానికి 6 బంతుల్లో 6 పరుగులు
బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్ టైటిల్. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఫలితం వచ్చింది. ఆసియాకప్ ఫైనల్ ఆఖరి ఓవర్. భారత విజయానికి ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి.. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.

బంగ్లాదేశ్‌తో ఫైనల్లో మాత్రం టీమిండియా:
ఈ దశలో ఏ జట్టు అయినా.. ఓవర్ ఆరంభంలోనే ఫోర్ లేదా సిక్స్ కోసం ప్రయత్నిస్తుంది. అయితే, బంగ్లాదేశ్‌తో శుక్రవారం ముగిసిన ఫైనల్లో మాత్రం టీమిండియా ఇందుకు భిన్నంగా వ్యవహారించింది. ఆఖరి ఓవర్‌లో సింగిల్స్ తీసి విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications