గర్వంగాఉంది: ఈ ధోనీ 'ఎంఎస్ ధోనీకి'కి పెద్ద అభిమాని
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మారథాన్ రేసులో సర్వీసెస్ అథ్లెట్ బహదూర్ సింగ్ ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ఈవెంటులో ఇతను రెండో స్థానంలో నిలిచాడు. ఇతను భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ అభిమాని కూడా.
ఎమ్మెస్ ధోనీది జార్ఖండ్ రాష్ట్రం అయితే.. బహదూర్ సింగ్ ధోనీది ఉత్తరాఖండులోని అల్మోరా గ్రామం. అయితే, మహేంద్ర సింగ్ ధోనీ పూర్వీకులది కూడా అల్మోరా గ్రామమే!

బహదూర్ సింగ్ ధోనీ మాట్లాడుతూ... నేను ధోనీకి పెద్ద అభిమానిని అని చెప్పాడు. ధోనీ గురించి ఎవరైనా నన్ను అడిగితే గర్వంగా భావిస్తానని చెప్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచంలో ఎందరికో ఆదర్శప్రాయుడు అన్నాడు.
భారత క్రికెట్ జట్టును లీడ్ చేయగల సమర్థులలో ధోనీ ముందు ఉంటాడని చెప్పారు. అంతేకాదు, ఆసియా కప్ గెలుచుకున్నట్లు ప్రపంచ కప్ ట్వంటీ 20ని కూడా ఎమ్మెస్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications