ధోనీయే సమధానం: ముంబై, హైదరాబాద్ జట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కౌంటర్


హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ధోనీ అంటే ఎంత ప్రత్యేక అభిమానముంటుందో దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో అంతకంటే విపరీతమైన భక్తి ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018లో టైటిల్ సాధించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ మరింతగా ఐపీఎల్ గుండెల్లో నాటుకుపోయాడు. ఈ ప్రదర్శనకే ధోనీని చెన్నై వాసులంతా తలైవార్.. తలా అని పిలుచుకుంటుంటారు.
రెండేళ్ల అనంతరం ఐపీఎల్‌లోకి పునరాగమనం చేస్తూనే ఫైనల్ వరకూ చేరింది. ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ విజయంతో చెన్నై జట్టుకు మూడో టైటిల్ గెలుచుకున్నట్లు అయింది. అయితే మంగళవారం ముంబై ఇండియన్స్ తన అభిమానులను ప్రశ్నిస్తూ.. ఒక ట్వీట్ చేసింది. దానికి బదులిచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ముంబై ఇండియన్స్‌తో కలిపి చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన సమాధానానికి షాక్ ఇచ్చినట్లు అయింది.
ముంబై ముగ్గురు ఆల్ రౌండర్లు
కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలు కలిపి ముగ్గురు ఉన్న ఫొటోను ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేస్తూ.. 'వీళ్లలో ఉత్తమ ఆల్‌రౌండర్ ఎవరో చెప్పండి. మీ సమాధానం కోసం వెయిట్ చేస్తుంటాం' అని తెలిపింది. దానికి కౌంటర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇలా స్పందించింది.
ముంబైకు హైదరాబాద్ సమాధానం
వెయిట్ చేయడమెందుకు. ఇదే మా సమాధానమంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. అందులో రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, షకీబ్ అల్ హసన్‌ల ఫొటోను పెట్టి ట్వీట్ చేసింది.
ముంబై ఇండియన్స్‌కు సూపర్ కింగ్స్ స్పందిస్తూ:
ముంబై ఇండియన్స్ ట్వీట్‌పై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇదిగో మా ముగ్గురు వీరులు అన్నట్లు ధోనీని మూడు రూపాలలో ఉంచి పోస్టు చేసింది. దాంతో ముంబై ఇండియన్స్ చేసిన ట్వీట్ కంటే చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్‌కే మంచి స్పందన లభించింది.
హైదరాబాద్‌కు కౌంటర్ ఇచ్చిన ముంబై:
బంగ్లాదేశ్ క్రికెటర్లు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ల ముగ్గురు ఫొటోలను ఉంచిన హైదరాబాద్‌కు కౌంటర్‌గా 'వెయిటింగ్ పూర్తవదు. ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది' అంటూ ట్వీట్ చేసింది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ కెరీర్‌లో మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ మాత్రం 2016 ఐపీఎల్‌లో మాత్రమే విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications