For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్‌గా ధోని

IPL 2019 Final : MS Dhoni Becomes Most Successful Wicket-Keeper In IPL History || Oneindia Telugu
MS Dhoni becomes most successful wicketkeeper in IPL history

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. ఉప్పల్ వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్‌లను ఔట్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత సాధించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ధోని ఖాతాలో మరో మైలురాయి

ఈ మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్వింటన్ డీకాక్(29) పరుగుల వద్ద ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే రోహిత్ శర్మ(15) సైతం ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఐపీఎల్‌లో ధోని ఇప్పటివరకు 132 మందిని పెవిలియన్ పంపాడు. అందులో 94 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు ఉన్నాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

ధోని తర్వాత ఈ జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ (131) ఉన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది.

చివరి వరకు పోరాడిన వాట్సన్

చివరి వరకు పోరాడిన వాట్సన్

చెన్నై జట్టులో షేన్ వాట్సన్(80) చివరివరకు పోరాడాడు. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ తరుణంలో అనూహ్యంగా పుంజుకొన్న ముంబై బౌలర్లు వాట్సన్‌ను రనౌట్‌ చేయడంతో తిరిగి పోటీలోకొచ్చింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీంతో అందరూ సూపర్‌ ఓవర్‌ ఖాయమేనని అనుకున్నారు.

32,405 మంది ప్రేక్షకులు హాజరు

32,405 మంది ప్రేక్షకులు హాజరు

అయితే, చివరి బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ వికెట్‌ తీసి మలింగ మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌ చరిత్రలో నాలుగు టైటిళ్లను నెగ్గిన జట్టుగా ముంబై అరుదైన ఘనత సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కి మొత్తం 32,405 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

Story first published: Monday, May 13, 2019, 15:11 [IST]
Other articles published on May 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+