For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs SRH: ఒకేఒక్కడు.. ఐపీఎల్‌లో చరిత్రలో ఎంఎస్ ధోనీ నయా రికార్డ్!!

MS Dhoni becomes IPLs most-capped player with 194 games, surpassing Suresh Raina
IPL 2020, CSK vs SRH : MS Dhoni Surpasses Raina To Become Most-Capped Player In IPL || Oneindia

దుబాయ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్ ద్వారా 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ధోనీ రికార్డ్ నెలకొల్పాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌ మహీకి 194వ ఐపీఎల్‌ మ్యాచ్‌. ఇప్పటి వరకు 193 మ్యాచ్‌లతో 'మిస్టర్ ఐపీఎల్' సురేశ్ రైనా నెం.1 స్థానంలో ఉండగా.. తాజాగా 194వ మ్యాచ్‌తో ధోనీ అగ్రస్థానానికి ఎగబాకాడు.

 రైనా రికార్డ్ బ్రేక్:

రైనా రికార్డ్ బ్రేక్:

ఐపీఎల్ 2019 సీజన్‌లో 193 మ్యాచ్‌లతో సురేశ్ రైనా లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా రికార్డుల్లో ఉన్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డ్‌ని ఎంఎస్ ధోనీ సమం చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్ ద్వారా.. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు. వ్యక్తిగత కారణాలతో రైనా ఐపీఎల్‌ 13వ సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లేదంటే ఈ ఏడాది కూడా రైనా తన రికార్డును పదిలంగా ఉంచుకునేవాడు.

చెన్నై తరఫున 164 మ్యాచులు:

చెన్నై తరఫున 164 మ్యాచులు:

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోనీ 164 మ్యాచులు ఆడాడు‌. చెన్నైపై రెండేళ్ల నిషేధం కారణంగా.. 2016, 17 సీజన్లలో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ జట్టులో మహీ 30 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నై కెప్టెన్‌గా ధోనీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌ని మార్చని ఏకైక ఫ్రాంఛైజీ కూడా చెన్నై కావడం విశేషం. ఇక 2016, 17 సీజన్లలో కూడా పుణె జట్టుకు మహీ సారథ్యం వహించాడు.

194 మ్యాచ్‌‌లు.. 4,523 పరుగులు:

194 మ్యాచ్‌‌లు.. 4,523 పరుగులు:

ఐపీఎల్‌లో 194 మ్యాచ్‌‌లాడిన ఎంఎస్ ధోనీ 137.8 స్ట్రైక్‌రేట్‌తో 4,523 పరుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 193 మ్యాచ్‌లే ఆడిన సురేశ్ రైనా 137.11 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 5,368 పరుగులు చేయగా.. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గత ఆగష్టు 15న ధోనీ, రైనా ఇద్దరూ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

ప్రతీ సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్:

ప్రతీ సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్:

ఐపీఎల్‌ 2008 సీజన్‌ నుంచి చెన్నై ప్రాంఛైజీ ఆడిన ప్రతీ ఐపీఎల్‌ మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు ఎంఎస్ ధోనీ సారథ్యం వహించాడు. అతని కెప్టెన్సీలోనే చెన్నై 163 మ్యాచ్‌ల్లో 100 విజయాలు నమోదు చేసింది. 2016, 2017 సీజన్లలో చెన్నైపై రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ టీమ్‌లో చేరిన ధోనీ 2018 టైటిల్‌ విజేతగా నిలిపాడు. మహీ నాయకత్వంలో ప్రతీ సీజన్‌లోనూ చెన్నై ప్లే ఆఫ్స్‌ చేరుకోవడం విశేషం. చరిత్రలో ఎనిమిది ఫైనల్స్‌ ఆడిన ఎల్లో ఆర్మీ మూడు సార్లు టైటిల్‌ నెగ్గింది.

Story first published: Saturday, October 3, 2020, 10:13 [IST]
Other articles published on Oct 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+