Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs CSK: ఐపీఎల్‌లో ధోని ప్రత్యేక సెంచరీ.. అలా చేసిన తొలి ఆటగాడిగా!

KKR vs CSK: బుధవారం రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే ఈ విజయం సీఎస్కేకు ఇప్పుడు ఎటువంటి తేడాను కలిగించదు ఎందుకంటే ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఒక ప్రత్యేక సెంచరీ నమోదైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేసి 18 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లో ధోని ప్రత్యేక సెంచరీ
ఐపీఎల్ చరిత్రలో 100వ సారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంఎస్ ధోని నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఏ బ్యాటర్ కూడా ఇలా చేయలేకపోయాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 241 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని.. అందులో 100 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ధోని నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంఎస్ ధోని తర్వాత ఈ జాబితాలో మరో సీఎస్కే ఆటగాడు రవీంద్ర జడేజా పేరు కూడా ఉంది. ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా 80 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.

MS Dhoni Becomes First Player to Remain Not Out 100 Times in IPL History

2 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై విజయం సాధించిన సీఎస్కే
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బ్యాటింగ్ చేసిన కెప్టెన్ అజింక్య రహానే అత్యధికంగా 48 పరుగులు చేశాడు. రహానే కాకుండా ఆండ్రీ రస్సెల్ 38 పరుగులు, మనీష్ పాండే 36 పరుగులు చేశారు. సీఎస్కే తరఫున బౌలింగ్ చేస్తూ.. నూర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 180 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. సీఎస్కే తరపున బ్యాటింగ్ చేసిన డెవాల్డ్ బ్రెవిస్ అత్యధికంగా 52 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. శివం దూబే 45 పరుగులు చేశాడు.

ఇంకా రిటైర్మెంట్ ఆలోచన లేదు..
బుధవారం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ చివరి దశలో ఉన్నానని ఒప్పుకున్నాడు. అయితే వెంటనే రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని, కాలక్రమేణా నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఈ విజయంతో సీఎస్కే 4 మ్యాచ్‌ల వరుస పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఆ తర్వాత ఫ్యాన్స్ ఇచ్చిన మద్దతును ధోని ప్రశంసిస్తూ.. ప్రస్తుత సీజన్ చివరిలో రిటైర్ అయ్యే ఉద్దేశం తనకు లేదని సూచించాడు.

మ్యాచ్ తర్వాత ధోని మాట్లాడుతూ.. "ఇది నాకు ఎప్పుడూ లభించే ప్రేమ, ఆప్యాయత. నా వయస్సు 42 సంవత్సరాలు అని మర్చిపోవద్దు. నేను చాలా కాలంగా ఆడుతున్నాను. చాలా మందికి నా చివరి మ్యాచ్ ఎప్పుడు ఉంటుందో తెలియదని.. కాబట్టి వచ్చిన వాళ్లు నా ఆటను చూడాలనుకుంటున్నానని నవ్వుతూ ధోని అన్నాడు. వాస్తవాన్ని తప్పించుకునే అవకాశం లేదని.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత తాను మరో ఆరు నుంచి 8 నెలలు కష్టపడి పని చేయాల్సి ఉంటుందన్నాడు. కానీ శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా లేదా అని చూడాలన్నాడు. ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని.. కానీ మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత అద్భుతం అంటూ అభిమానులను ఉద్దేశించి అన్నాడు.

Story first published: Thursday, May 8, 2025, 13:08 [IST]
Other articles published on May 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+