ధోని రికార్డుల వెల్లువ: వన్డేల్లో 200 సిక్సులు బాదిన తొలి భారత క్రికెటర్
హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం టీమిండియా వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య శుక్రవారం ఆంటిగ్వాలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఖాతాలోకి మరో రెండు రికార్డులు వచ్చి చేరాయి.
గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ధోని చాన్నాళ్ల తర్వాత ఈ వన్డేలో అంతర్జాతీయ స్థాయిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 79 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తొలి భారత క్రికెటర్‌గా ధోని
అంతేకాదు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత్ బ్యాట్స్‌మన్‌గా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. శుక్రవారం విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 15వ పరుగు తీసిన ధోనీ టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించాడు.

నాలుగో ఆటగాడిగా అరుదైన ఘనత
ఈ మ్యాచ్‌లో అజేయంగా 78 పరుగులు చేసి మొత్తం 9,442 పరుగులతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా 11,363 పరుగులతో సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో, 10,889 పరుగులతో రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన ధోని
అజారుద్దీన్ 9,378 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన ధోని వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ధోని (వన్డే, టెస్టు, టీ20)లో 322 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది 476 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కీపర్లా జాబితాలో రెండో స్థానంలో
ఆ తర్వాత క్రిస్‌గేల్ (434), బ్రెండన్ మెకల్లమ్ (398), సనత్ జయసూర్య (352) సిక్స్‌లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధికంగా సెహ్వాగ్, టీ20ల్లో అత్యధికంగా యువరాజ్, వన్డేల్లో అత్యధికంగా ధోనీ సిక్స్‌లు బాదారు. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కీపర్ జాబితాలో ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర 13,341 పరుగులతో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా 9,442 పరుగులతో ధోనీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications