Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ.49కే అన్నీ అంటూ కొత్త గెటప్‌లో ధోనీ, పాండ్యా(వీడియో)

MS Dhoni Becomes Bittu Bhaiya, Speaks Bhojpuri With Hardik Pandya

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వాణిజ్య ప్రకటనల్లో ఇంకా టాప్‌గానే కొనసాగుతున్న ధోనీ.. ఏ గెటప్ వేసినా ఇట్టే సరిపోతాడు. లుంగీ కట్టి లోకల్ వాలా గెటప్ వేసినా.. తొడగొట్టి కబడ్డీ ప్లేయర్ అనిపించినా సరిగ్గా సరిపోతాడు. ఈ క్రమంలో మరోసారి వాణిజ్య ప్రకటనలో తనదైన శైలి సహజత్వమైన నటన చూపించాడు. ఈ సారి హార్దిక్ పాండ్యాతో కలిసి గ్రామీణ నేపథ్యమున్న యువకుని పాత్రలో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కలిసి నటించిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. స్టార్ నెట్‌వర్క్ తమ చానెల్స్ ప్యాకేజీని ప్రమోట్ చేసేందుకు ఈ యాడ్‌ను రూపొందించింది.

చెట్టుపై కూర్చొని బిట్టూ భయ్యా

ఇందులో ధోనీతోపాటు పాండ్యా భోజ్‌పురిలో మాట్లాడటం చాలా ఫన్నీగా ఉంది. ధోనీ ఇందులో బిట్టూ భయ్యాగా కనిపించాడు. ఓ చెట్టుపై కూర్చొని బైనాక్యులర్స్‌లో దూరంగా జరుగుతున్న మ్యాచ్‌ను ఈ ఇద్దరు క్రికెటర్లు చూస్తున్నట్లుగా యాడ్‌ను చిత్రీకరించారు. ధోనీ, పాండ్యా చాలా సహజంగా నటిస్తూ తమ పాత్రల్లో జీవించేశారు. ఈ వీడియోను పాండ్యా తన ట్విటర్‌లో షేర్ చేశాడు. కేవలం రూ.49కే స్టార్ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని చానెల్స్ వస్తాయని చెప్పడమే ఈ యాడ్ ఉద్దేశం.

 వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా వెళ్లనున్న ధోనీ, పాండ్యా

వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా వెళ్లనున్న ధోనీ, పాండ్యా

ఆస్ట్రేలియా పర్యటనకు ఇప్పటివరకు దూరమైన ఈ ఇద్దరూ వన్డే జట్టులో ఎంపికయ్యారు. త్వరలోనే టీమిండియా శిక్షణలో పాల్గొననున్నారు. ఆసియా కప్ జరుగుతుండగా హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఫిట్‌నెస్ సాధించి మళ్లీ జట్టులోకి చేరనున్నాడు. ఫామ్ లేమి కారణంగా టీమిండియాకు దూరమైన వన్డే సిరీస్‌కు ఎంపికై జట్టులో చేరనున్నాడు.

మెల్‌బౌర్న్ వేదికగా గెలిచి చారిత్రక విజయం

మెల్‌బౌర్న్ వేదికగా గెలిచి చారిత్రక విజయం

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా టెస్టు సిరీస్‌లో భాగంగా ఆదివారం మూడో టెస్టులో విజయం సాదించింది. బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా జరిగిన ఈ మ్యాచ్‌ను మెల్‌బౌర్న్ వేదికగా గెలిచి చారిత్రక విజయం సాధించింది. దీంతో కెప్టెన్ కోహ్లీకి కూడా మరిన్ని అరుదైన ఘనతలు సాధించాడు.

Story first published: Sunday, December 30, 2018, 17:30 [IST]
Other articles published on Dec 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+