Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు

లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ బ్యాటు ఝుళిపించాడు. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్సర్ బాదాడు. యశ్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఓ సిక్సర్, రెండు బౌండరీలు సాధించాడు.
తొమ్మిది బంతుల్లో అజేయంగా 29 పరుగులు సాధించాడు.

ఈ క్రమంలో ధోనీ ఐపీఎల్‌లో అయిదు వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అయిదు వేల పరుగులు సాధించిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ సీజన్‌లో ధోనీ మినహా ఏ వికెట్ కీపర్ ఈ ఫీట్‌ను సాధించలేకపోయాడు. ఓవరాల్‌గా ఈ మార్క్‌ను అందుకున్న అయిదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

MS Dhoni became the first WK batter to complete 5000 runs in IPL history

అత్యధిక పరుగుల చేసిన జాబితాలో ధోనీ కంటే ముందు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా ఉన్నారు. ఈ సీజన్‌లో ధోనీ ఒక్కసారి కూడా ఔట్ కాకపోవడం విశేషం. 34 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. కాగా, ధోనీ దూకుడుకు రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో, 5x4, 1x6) నిలకడైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో లక్నో సూపర్ జెయింట్స్‌కు సీఎస్కే 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.లక్నో బౌలరల్లో కృనాల్ పాండ్య (2/16) ఆకట్టుకున్నాడు. అయితే రెండో ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర గోల్డన్ డకౌటయ్యాడు. మోహ్సిన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (17; 13 బంతుల్లో, 1x4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో సీఎస్కే 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

అయితే నాలుగో స్థానంలో శివమ్ దూబె (3; 8 బంతుల్లో)కు బదులుగా రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ అజింక్య రహానె (36; 24 బంతుల్లో, 5x4, 1x6)తో కలిసి జడేజా కాస్త దూకుడగా ఆడటానికి ప్రయత్నించాడు. వీరిద్దరు బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో చెన్నై 51 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత రహానె‌ను కృనాల్ పాండ్య క్లీన్‌బౌల్డ్ చేయడంతో సీఎస్కే కథ మారిపోయింది. దూబె, రహానె స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమీర్ రిజ్వీ ( 1; 5 బంతుల్లో) విఫలమయ్యారు. దీంతో 90 పరుగులకే చెన్నై అయిదు వికెట్లు కోల్పోయింది.

కానీ మరో ఎండ్‌లో ఉన్న జడేజా.. మొయిన్ అలీ (30; 20 బంతుల్లో, 3x6) తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఓ దశలో జడ్డూ, అలీ నిలకడగా ఆడటంతో 15 ఓవర్లలో సీఎస్కే 105 పరుగులే చేసింది. ఆ తర్వాత వీరిద్దరు గేర్ మార్చారు. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో జడేజా సిక్సర్ బాది 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

Story first published: Friday, April 19, 2024, 22:14 [IST]
Other articles published on Apr 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+