న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand 3rd T20I: ఆఖరి టీ20లో ధోని మెరుపు స్టంపింగ్ (వీడియో)

India Vs New Zealand : MS Dhoni's Quick Stumping To Send Tim Seifert Packing During 3rd T20I
MS Dhoni beats the clock with a lightning-quick stumping to send Tim Seifert packing - Watch video

హైదరాబాద్: హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని మరోసారి మాయ చేశాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్‌ను ధోని ఓ మెరుపు స్టంపింగ్‌తో పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. తొలి టీ20లాగే కివీస్ ఓపెనర్లు సీఫెర్ట్, మన్రో, గ్రాండ్‌హోమ్ భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. వీరిద్దరూ కలిసి 7.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు.

3rd T20I: టీమిండియా విజయ లక్ష్యం 2133rd T20I: టీమిండియా విజయ లక్ష్యం 213

మెరుపు స్టంపింగ్ చేసిన ధోని

న్యూజిలాండ్ జట్టు ఓపెనర్లు టీమ్‌ సీఫెర్ట్‌ (43;25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కొలిన్ మున్రో (72: 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అయితే, మ్యాచ్ ఆరంభంలో ప్రమాదకరంగా కనిపించిన టిమ్ సీఫెర్డ్‌ను ధోనీ ఓ మెరుపు స్టంపింగ్‌తో ఔట్ చేశాడు.

రెప్పపాటు కాలంలో

చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రెప్పపాటు కాలంలో బంతిని అందుకొని ధోని వికెట్లను గిరాటేసి సీఫెర్డ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కివీస్ విధ్వంసక ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (43: 25 బంతుల్లో 3x4, 3x6) క్రీజు వెలుపలికి వెళ్లి బంతిని ముందుకు ఫుష్ చేసేందుకు ప్రయత్నించాడు. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వికెట్ కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. రెప్పపాటులో బెయిల్స్‌ను పడగొట్టిన ధోనీ.. ఔట్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌‌కి నివేదించాడు. రిప్లైలో సెకనులోపే ధోనీ స్టంపౌట్ చేయగా.. ఆ సమయంలో సీఫర్ట్ పాదం క్రీజు లోపల లేదని తేలడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

4 ఓవర్లలో 54 పరుగులిచ్చిన పాండ్యా

కృనాల్ పాండ్యా అయితే 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ 4 ఓవర్లలో 44 పరుగులు, భువనేశ్వర్ 37 పరుగులు, ఖలీల్ అహ్మద్ 47 పరుగులు ఇచ్చారు. కుల్దీప్ మాత్రమే 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.

Story first published: Sunday, February 10, 2019, 15:11 [IST]
Other articles published on Feb 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X