ధోని ఈజ్ బ్యాక్: జార్ఖండ్ స్టేడియంలో చెమటోడ్చాడు, వీడియో వైరల్

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు శుభవార్త. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్న ధోని మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా గురువారం రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు.
నెట్స్‌లో ధోని జార్ఖండ్ బౌలర్లు సంబంధించిన బంతులను ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు.
సెలక్షన్ కమిటీకి అందుబాటులో
ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు. వెస్టిండిస్‌తో ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

నెట్స్‌లో ధోని ప్రాక్టీస్
పూర్తి స్థాయి ఫిట్‌నెస్ అందుకోవడానికి జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత భారత్ పర్యటనకు వెస్టిండిస్ జట్టు రానుంది. ఈ నేపథ్యంలో ధోని వెస్టిండిస్ పర్యటనకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

స్వదేశంలో టీమిండియా మ్యాచ్ షెడ్యూల్ ఇదే:
నవంబరు 14-18: తొలి టెస్టు - ఇండోర్
నవంబరు 22-26: రెండో టెస్టు - కోల్‌కతా

వెస్టిండీస్ vs టీమిండియా - 2019
డిసెంబరు 6: తొలి టీ20 - ముంబై
డిసెంబరు 8: రెండో టీ20 - తిరువనంతపురం
డిసెంబరు 11: మూడో టీ20 - హైదరాబాద్
డిసెంబరు 15: తొలి వన్డే - చెన్నై
డిసెంబరు 18: రెండో వన్డే - విశాఖపట్నం
డిసెంబరు 22: మూడో వన్డే - కటక్

జింబాబ్వే vs టీమిండియా - 2020
జనవరి 5: తొలి టీ20- గౌహతి
జనవరి 7: రెండో టీ20 - ఇండోర్
జనవరి 10: మూడో టీ20- పుణె

ఆస్ట్రేలియా vs టీమిండియా -2020
జనవరి 14: తొలి వన్డే - ముంబై
జనవరి 17: రెండో వన్డే - రాజ్‌కోట్
జనవరి 19: మూడో వన్డే - బెంగళూరు

దక్షిణాఫ్రికా vs టీమిండియా -2020
మార్చి 12: మొదటి వన్డే - ధర్మశాల
మార్చి 15: రెండో వన్డే - లక్నో
మార్చి 18: మూడో వన్డే - కోల్‌కతా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications