
హైదరాబాద్: కటక్‌లోని బారాబతి వేదికగా మహేంద్ర సింగ్ ధోని చెలరేగిపోయాడు. భారత్- శ్రీలంకకు మధ్య టీ 20సిరీస్‌లో భాగంగా బుధవారం మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ అదరగొట్టాడు. భారత కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎలా అయితే ఆడేవాడో అదే స్థాయిలో రెచ్చిపోయి శ్రీలంకపై పరుగులు తీశాడు. మొత్తం 22 బంతులకు గాను వ్యక్తిగత 39 స్కోరును నమోదు చేశాడు.
అయితే ఈ ప్రదర్శనతో ధోనీకి స్థానానికి ప్రమోషన్ వచ్చినట్లు అయింది. తన పొజిషన్‌ను మార్చాలంటూ రోహిత్ శర్మ హైకమండ్‌కు సిఫారసు చేశాడు. ఈ నిర్ణయం ఖరారైతే ధోనీ నాలుగో స్థానంలో ఉండబోతున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ధోనీ ఓ ఆదర్శప్రాయుడని కొనియాడాడు. తాను చేసిన స్కోరు వల్లనే 180 స్కోరును అలవోకగా గెలిచామని పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ పనిలో పని అన్నట్లుగా కేఎల్ రాహుల్‌ని కూడా పొగిడేశాడు. వన్డే జట్టులో తాను సభ్యుడు కాకపోయినా ఈ మ్యాచ్‌కు బ్యాటింగ్‌లో తన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని ప్రశంసించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా మాట్లాడుతూ.. యజువేంద్ర చాహల్ చాలా కృషి చేశాడు. ప్రత్యర్థికి 4/23 స్కోరును మాత్రమే చేసే విధంగా తన బౌలింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించాడని వ్యాఖ్యానించాడు.
చాలా గేమ్ తర్వాత ఆడిన మొదటి గేమ్ అయినా కూడా ఫాస్ట్ బౌలర్ జయదేవ్
అద్వితీయంగా ఆడాడని అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందు తామే బౌలింగ్ చేయాల్సిందని కానీ, బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందన్నాడు. అయినా బౌలర్ల కృషి అద్భుతమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను గెలిచామన్నాడు. ఈ శుభారంభాన్ని ఇలానే కొనసాగిస్తామనే నమ్మాకాన్ని వెలిబుచ్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.