ఫోటోలు: కుమార్తె పుట్టినరోజు కోసం ముస్సోరీకి ధోని
హైదరాబాద్: కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఆట నుంచి తీరిక దొరికినప్పుడల్లా తన ముద్దులు కూతురు జీవాతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు దోని ఇష్టపడుతున్నాడు.
ధోని ఉత్తరాఖండ్‌లో ధోని
ఇందులో భాగంగా సోమవారం తన కుమార్తె జీవా రెండో పుట్టిన రోజు కావడంతో తన భార్య సాక్షితో పాటు స్నేహితులతో కలిసి ధోని ఉత్తరాఖండ్ చేరుకున్నాడు. ఉత్తరాఖండ్‌లోని హిల్ స్టేషన్ ముస్సోరీలో తన కుమార్తె జీవా రెండో పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు.
రెండో పుట్టినరోజు జరుపుకుంటున్న జీవా
(ఫిబ్రవరి 6) సోమవారం ధోని కుమార్తె జీవా రెండవ పుట్టినరోజుని జరుపుకుంటుంది. ఈ క్రమంలో ధోని కుటుంబం, స్నేహితులతో కలిసి ఆదివారం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి చేరుకున్నారు. ముస్సోరీలోని రాక్‌బే మనార్‌లో వీరు బస చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
సాక్షి ఇనిస్టాగ్రామ్‌లో ఫోటోలు
ధోని ముస్సోరీ పర్యటకను సంబంధించిన ఫోటోలను భార్య సాక్షి తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఉత్తరాఖండ్‌తో ధోనికి ప్రత్యేక అనుబంధం ఉంది. ధోని తండ్రి పాన్‌సింగ్ ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందినవారు.
ధోని, సాక్షిల వివాహం కూడా డెహ్రాడూన్‌కు
మరోవైపు ధోని, సాక్షిల వివాహం కూడా డెహ్రాడూన్‌కు సమీపంలో జరిగింది. దీంతో తన కుటుంబంలోకి వచ్చిన కొత్త సభ్యురాలు, తన కుమార్తె జీవా రెండో పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేందుకు కుటుంబంతో పాటు ధోని ఉత్తరాఖండ్‌కు చేరుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications