ముంబై: 180 కిలోల బరువు నుంచి 108 కిలోలకు తగ్గిన అనంత్ అంబానీకి ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఎంతో శ్రమించి, కఠిన నియమాలు పాటించి సన్నబడిపోయారని అభినందిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ తనయుడైన అనంత్‌కు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ నుంచి కూడా ప్రశంసలు అందాయి.
క్రమశిక్షణ, అంకితభావంతో శ్రమించి బరువు తగ్గించుకున్నందుకు అతడిని ధోనీ అభినందించాడు. అనంత్ అంబానీకి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు ధోనీ. 100 కేజీలుపైగా బరువు తగ్గించుకుని తనకు తానే అనంత్ పుట్టిన రోజు కానుక ఇచ్చుకున్నాడని ధోనీ వ్యాఖ్యానించాడు.

అనంత్ అంబానీతో దిగిన ఫొటోను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ధోనీ. 18 నెలల్లో అనంత్.. 108 కిలోల బరువు తగ్గాడు. రోజుకు ఐదారుగంటల వ్యాయామం, 21 కిలోమీటర్ల నడక, డైటింగ్ తో అతడు సన్నబడ్డాడు.
కాగా, శనివారం ముంబై ఇండియన్స్, పుణె మ్యాచ్ సందర్భంగా సచిన్ టెండూల్కర్ తో అనంత్ అంబానీ ఫొటో దిగాడు. ఈ ఫొటోలు కూడా అనంత్ అంబానీకి ప్రశంసలు అందించేలా చేస్తున్నాయి. కాగా, అనంత్ అంబానీ బరువు తగ్గడం సోషల్ మీడియాలో ప్రముఖ అంశంగా మారిపోయింది.