Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'యానిమల్' అవతారమెత్తిన ధోనీ - సందీప్ వంగా డైరెక్షన్‌లో.. (వీడియో అదిరింది)

ఐపీఎల్ 2025కు మరో మూడు రోజులే సమయం మిగిలి ఉంది. దీంతో ఆయా జట్లు ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభించి సాధన మొదలు పెట్టేశాయి. అయితే ఈ సమయంలో యానిమల్‌ అవతారమెత్తాడు సీఎస్కే స్టార్ బ్యాటర్ ధోనీ. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఓ యాడ్ షూట్ చేశాడు. ఇందులో అచ్చం రణ్‌బీర్ కపూర్ తరహాలో స్టైల్, గెటప్‌లో సూపర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు మహీ.

ఈ వీడియో కోసం.. యానిమల్ సినిమాలోని మూడు సన్నివేశాలను ఊపయోగించారు. బ్లూ కలర్ కోట్ ధరించి, బ్లాక్ కలర్ కారులో నుంచి సీరియస్ గా దిగే హీరో సీన్, సినిమా ఎంట్రీ సీన్ లో హీరోయిన్ ఇంటికి సైకిల్ మీద వెళ్లే సన్నివేశం, అలాగే క్లైమాక్స్ లో హీరో చేతితో సైగ చేసే సీన్ లో ధోనీ నటించారు.

MS Dhoni Animal advertisement directed by sandeep vanga hilarious video viral
Photo Credit: twitter screenshot

ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రమోషన్ కోసం చేసిన యాడ్ ఇది. దీనికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. అయితే దీన్ని ఫన్నీ మోడ్‌లో చిత్రీకరించి నవ్వులు పూయించారు. ఈ వీడియోలో సందీప్ వంగా కూడా కనిపించడం విశేషం. తాజాగా ఈ యాడ్ ను విడుదల చేయగా.. క్రికెట్ ఫ్యాన్స్ ను ఇది తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ధోనీ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. అలానే నవ్వులు కూడా పూయిస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం మహీ.. ఐపీఎల్ 2025 కోసం సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. అలానే సందీప్ వంగా..ప్రభాస్ తో కలిసి 'స్పిరిట్'చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు.

Story first published: Tuesday, March 18, 2025, 14:38 [IST]
Other articles published on Mar 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+