పిల్లలతో ఇండియన్ క్రికెటర్స్ : తీరిక దొరికితే కుటుంబమే లోకం.. (ఫోటోలు)
న్యూఢిల్లీ : లైవ్ క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఫోర్లు, సిక్సర్లు బాదడం.. బౌలర్లయితే వికెట్ల మీద వికెట్లు టపీమని పడగొట్టడం.. టీవీ ముందైనా..! గ్రౌండ్ నుంచైనా..! వీక్షించే ప్రేక్షకులెవరికైనా కిక్కిచ్చే విషయమే. అయితే సదరు క్రికెటర్ ను ప్రత్యక్షంగా గాక, నెలల తరబడి టీవీల్లోనే చూడాల్సి రావడం ఆయా క్రికెటర్ల కుటుంబాలకు మాత్రం కాస్త బాధాకరమే.
అందుకే.. తీరిక లేని షెడ్యూల్ తో బిజిబిజీగా గడిపే టీమ్ ఇండియా క్రికెటర్లంతా ఏమాత్రం తీరిక దొరికినా కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తారు. టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ నుంచి ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే వరకు అందరిదీ ఇదే తీరు. ఖాళీ దొరికిందా.. కుటుంబంతో జాలీగా గడిపేయాల్సిందే.

కూతురు జివాతో ధోని : టీమ్ ఇండియా డైనమైట్ ధోనికి కూతురు జివా
అంటే చెప్పలేనంత ప్రేమ. అందుకే ఖాళీ దొరికిందంటే.. కూతురితో ఆడుకోవడం, ఆ చిన్నారితో సెల్ఫీలు తీసుకోవడం, జివాతో కలిసి ఫన్నీ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి చేస్తుంటాడు.
పిల్లలతో శిఖర్ ధావన్
టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తాడు. భార్యతో పాటు తన కొడుకు ఇద్దరు కూతుళ్లతో రెస్టారెంట్స్ కు వెళ్లడం, టూర్స్ ప్లాన్ చేయడం చేస్తుంటాడు.
భార్య కూతుళ్లతో రైనా
ఇక ఈమధ్యే తండ్రిగా మారిన క్రికెటర్ సురేశ్ రైనా కూడా అంతే. తీరిక దొరికితే కుటుంబంతోనే గడిపేస్తుంటాడు. ఇదిగో ఇలా.. తన కూతురు గ్రేసియా, భార్య ప్రియాంకతో కలిసి జాలీగా గడుపుతుంటాడు.

కుమారులతో సెహ్వాగ్
ఆటలో దూకుడుకు కేరాఫ్ అయిన సెహ్వాగ్.. కుటుంబ విషయంలో మాత్రం చాలా కూల్. ఇదిగో పిల్లలతో కలిసి ఇలా మ్యాచ్ లను వీక్షించడానికి వెళుతుంటాడు.
ఫ్యామిలీతో కోచ్ కుంబ్లే
ప్రస్తుత టీమ్ ఇండియా కోచ్ అనిల్ కుంబ్లే కూడా కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఇదిగో ఇలా కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్స్ లో గడుపుతుంటాడు.
అందరి కంటే ముందుంటాడు
కుటుంబంతో గడిపే విషయంలో అందరికంటే ముందుంటాడేమో క్రికెట్ గాడ్ టెండూల్కర్. కుటుంబంతో టూర్స్ ప్లాన్ చేసుకునే సచిన్, తన ఫేవరేట్ ప్లేస్ ముసోరికి కుటుంబంతో తరుచూ వెళుతుంటాడు.
తీర్థయాత్రల్లో వీవీఎస్ లక్ష్మణ్
కుటంబంతో కలిసి సప్తకాశి దైవ దర్శనం చేసుకున్న వీవీ ఎస్ లక్ష్మణ్, ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications