Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వేలం తర్వాత పోటీ పడిన ధోనీ-పంత్ .. మహీపై భారీ షాట్లతో పంత్ (వీడియో)

ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. తొలిసారిగా భారత్ వెలుపల దుబాయ్ వేదికగా వేలాన్ని నిర్వహించారు. ఈ వేలంలో గత వేలం రికార్డులు బద్దలయ్యాయి. మిచెల్ స్టార్క్ ఆల్‌టైమ్ రికార్డు ధర పలికాడు. ప్యాట్ కమిన్స్ కూడా భారీ ధర సొంతంచేసుకున్నాడు. స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.కమిన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లు వెచ్చించింది.

ఈ వేలంలో మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఐపీఎల్ వేలం చరిత్రలో తొలిసారి మహిళ ఆక్షనీర్ మల్లిక సాగర్ పాల్గొన్నారు. అంతేగాక జట్టు తరపున ఆక్షన్‌లో పాల్గొన్న తొలి కెప్టెన్‌గా రిషభ్ పంత్ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ వేలానికి వచ్చాడు. అయితే వేలం అనంతరం పంత్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఓ మ్యాచ్‌లో తలపడ్డారు.

MS Dhoni and Rishabh Pant compete after IPL 2024 auction. Pant with heavy shots on Mahi. Video goes viral.

ఆక్షన్ ముగిసిన అనంతరం ధోనీ-పంత్ సరదాగా టెన్నిస్ ఆడారు. నీటిపై ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టులో డబుల్స్ ఆడారు. ధోనీ, పంత్ ప్రత్యర్థుల్లా ఈ మ్యాచ్‌లో తలపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ధోనీపై పంత్ బలంగా ఓ షాట్ కొట్టాడు. దాంతో మ్యాచ్‌ను చూస్తున్న ఫ్యాన్స్ ఒక్కసారిగా కేకలు వేయడంతో పంత్ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు.

వేలంలో చెన్నై దక్కించుకున్న ప్లేయర్లు: డారిల్ మిచెల్‌ (రూ. 14 కోట్లు), సమీర్‌ రిజ్వీ (రూ. 8.40 కోట్లు), శార్దూల్‌ ఠాకూర్ (రూ. 4 కోట్లు), ముస్తాఫిజుర్‌ (రూ. 2 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ. 1.80 కోట్లు), అవనీశ్‌ రావు (రూ. 20 లక్షలు)

ఢిల్లీ సొంతం చేసుకున్న ఆటగాళ్లు: కుశాగ్ర ( రూ. 7.20 కోట్లు), జే రిచర్డ్‌సన్‌ (రూ. 5 కోట్లు), హ్యారీ బ్రూక్‌ (రూ. 4 కోట్లు), సుమిత్‌ (రూ. 1 కోటి), షై హోప్‌ (రూ. 75 లక్షలు), స్టబ్స్‌ (రూ. 50 లక్షలు), రికీ భుయ్‌ (రూ. 20 లక్షలు), స్వస్తిక్‌ (రూ. 20 లక్షలు), రసిక్‌ (రూ. 20 లక్షలు)

Story first published: Wednesday, December 20, 2023, 14:34 [IST]
Other articles published on Dec 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+