'ధోని నిజాయితీపై నమ్మకం ఉంచండి, చర్చ అనవసరం'
హైదరాబాద్: 2019 వరల్డ్ కప్‌కు ఆడే జట్టులో ధోనిని ఉంటాడా? లేదా? అనే దానిపై చర్చ అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ స్పష్టం చేశాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో కామెంటేటర్‌గా వ్వవహరిస్తోన్న మైక్ హస్సీ క్రిక్ బజ్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పలు విషయాలను ప్రస్తావించారు.
'వచ్చే వరల్డ్ కప్ వరకూ ధోనికి కొనసాగుతాడా? లేదా? అనేది అతనిపై మాత్రమే ఆధారపడుతుంది. అతను అప్పటివరకూ ఆడగలను అనుకుంటే కచ్చితంగా ఆడతాడు. ఒకవేళ భారత్ కు ఇక ప్రాతినిథ్యం వహించే సత్తా తనలో లేదని భావించిన మరుక్షణమే అక్కడ ధోని ఉండడు. ఇక్కడ ధోని నిజాయితీపై నమ్మకం ఉంచండి. దీని గురించి చర్చ అనవసరం' అని మైక్ హస్సీ అన్నాడు.

'ధోని 36వ ఒడిలో ఉన్నప్పటికీ ఇంకా పోరాడే తత్వం అతనిలో ఉంది. క్రికెట్ అనే గేమ్ గురించి ధోని ఎంత బాగా తెలుసో.. తాను ఆడాలో లేదా అనేది కూడా ధోనికి అంతే బాగా తెలుసు. క్రికెట్ కెరీర్ కు ఉద్వాసన చెప్పే సమయం వచ్చిందని భావిస్తే వెంటనే వీడ్కోలు చెబుతాడు' అని హస్సీ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications