Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా పేరు దుర్వినియోగం: మొబైల్ కంపెనీపై ధోని పిటిషన్

హైదరాబాద్: ఒప్పందం రద్దు చేసుకున్నా ఓ మొబైల్‌ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తన పేరును వాడుకుంటూ దుర్వినియోగం చేస్తోందని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. వివరాల్లోకి వెళితే గతంలో మ్యాక్స్ మొబిలింక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనితో ఒప్పందం చేసుకుంది.

అయితే ఈ ఒప్పందం నాలుగేళ్ల క్రితమే ముగిసినా, ఇంకా ఆ కంపెనీ ధోని పేరుని ఇంకా వాడుకుంటోంది. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోని ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి గతేడాది ఏప్రిల్ 21వ తేదీన కోర్టు నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేసినా, వాటిని కంపెనీ బేఖాతరు చేస్తోందని తెలిపాడు.

MS Dhoni alleges misuse of his name by mobile firm

దీంతో ధోని పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కోర్టు ఉత్తర్వులకు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ఆ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు మార్గదర్శకాల్ని అమలు చేయాల్సిన కంపెనీ అతిక్రమణకు పాల్పడటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ధోని పేరును కమర్షియల్‌గా వాడుకోవడం వెనుక ఉద్దేశం ఏంటని కంపెనీని ప్రశ్నించింది.

ఇందులో భాగంగా కోర్టు ధిక్కారణకు పాల్పడిన ఆ కంపెనీ ఉన్నతాధికారుల్ని తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మ్యాక్స్ మొబిలింక్ కంపెనీతో ధోని చేసుకున్న ఒప్పందం 2012 డిసెంబర్ నెలతో ముగిసింది. అయినా ధోని పేరున తమ వెబ్ సైట్ల నుంచి ఆ కంపెనీ తొలగించలేదు.

దీంతో తన పేరుని దుర్వినియోగం చేస్తూ కంపెనీ మార్కెటింగ్‌ను కొనసాగిస్తోందని ధోని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై గతంలో ఢిల్లీ హైకోర్టును ధోని ఆశ్రయించాడు. ఆ క్రమంలోనే ధోని పేరును వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే కంపెనీ కోర్టు ధిక్కారణకు పాల్పడింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+