ఈ దశాబ్దాపు కెప్టెన్ ఎవరో చెప్పండి: ధోని అంటూ ఐసీసీకి వెల్లువెత్తుతున్న ట్వీట్లు!

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని.... క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని. టీమిండియాకు రెండు ప్రపంచ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. అభిమానులు ముద్దుగా 'మహీ' అని పిలుచుకుంటారు. ధోని సారథ్యంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్‌ను సాధించింది.
ఐసీసీ నిర్వహించే మూడు ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్భుతమైన ఆటతీరుతో జట్టులో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు కెప్టెన్‌గా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 17,266 పరుగులు చేశాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందిన ధోని 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాలో ఓడించింది. ఇక, 2011లో సొంతగడ్డపై ధోని నాయకత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.
ముఖ్యంగా వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోని బాదిన విన్నింగ్స్ సిక్స ప్రతి భారత అభిమానికి ఇప్పటికీ గుర్తే. ఆ తర్వాత 2013లో ధోని నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. ఇలా, ధోని నాయకత్వంలోని టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది.
'ఈ దశాబ్దానికి మీకు ఇష్టమైన కెప్టెన్ ఎవరో చెప్పండి' అని ఐసీసీ బుధవారం ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ దశాబ్దపు కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేయాలని అతడి అభిమానులు కోరుతున్నారు. ముఖ్యంగా ధోని అభిమానుల నుంచి ఐసీసీకి పెద్ద ఎత్తున రీట్వీట్లు వెల్లువెత్తున్నాయి.
'ఈ దశాబ్దం ధోనీది. వచ్చే దశాబ్దం కోహ్లీది' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.... మరొక నెటిజన్ 'ఈ దశాబ్దపు కెప్టెన్ ఎంఎస్ ధోనీ' అని ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications