Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ రూటే సపరేటు.. ఈసారి ట్రాక్టర్‌పై చక్కర్లు (వీడియో)!!

MS Dhoni Adds A New Mahindra Swaraj Tractor To His Fleet Of Cars And Bikes

జార్ఖండ్: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై గత ఆరు నెలలుగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గత బుధవారం 'ధోనీ రిటైర్స్' ట్యాగ్ ట్రెండ్ అవడం.. గురువారం దానికి కౌంటర్‌గా 'ధోనీ నెవర్ రిటైర్స్' ట్యాగ్ ట్రెండ్ చేయడంతో ధోనీ వీడ్కోలు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే మహీ మరికొన్ని రోజులు ఆడుతాడని చాలా మంది మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలవగా.. ధోనీ లాస్ట్ మ్యాచ్ ఆడేశాడని మరికొందరు అంటున్నారు. ఎలాంటి వార్తలు వచ్చినా మహీ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

సోషల్‌ మీడియాకు దూరం:

సోషల్‌ మీడియాకు దూరం:

ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఇతర క్రికెటర్లలా ఎంఎస్ ధోనీ సోషల్‌ మీడియాలో కనిపించడం లేదు. ట్విట్టర్, పేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ చాట్‌లు నిర్వహించడం లేదు. మహీ ఇంట్లో ఏం చేస్తున్నాడో అప్పుడప్పుడూ అతడి భార్య సాక్షి ధోనీ చెపితే గానీ అసలు విషయం తెలియట్లేదు. ఇప్పడు కూడా ధోనీ ఏం చేస్తున్నాడో.. మరోసారి అభిమానులకు సాక్షి తెలిపారు.

ట్రాక్టర్‌పై చక్కర్లు:

తాజాగా ఎంఎస్ ధోనీ తన ఇంట్లోని తోటలో ట్రాక్టర్‌ నడిపాడు. స్వరాజ్ ట్రాక్టర్‌ ఎక్కి రాంచీలోని తోటలో ఓ రౌండ్ వేసాడు. బైక్ నడిపినట్టుగానే చాలా సునాయాసంగా నడిపేశాడు. చివరకు ఇంజన్ ఆపేసి దిగిపోయాడు. అయితే మహీ ట్రాక్టర్‌ నడుపుతున్న సమయంలో పక్కన మరొకరు కూడా ఉన్నారు. ఈ వీడియోను సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఐపీఎల్‌లో మహీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన అధికారిక ట్విట్టర్‌లో జత చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా స్వర పరిచిన 'మౌనరాగం' అనే తమిళ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ను వీడియోకు జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

మంచు కొండల్లో విహరించాలని:

మంచు కొండల్లో విహరించాలని:

దేశంలో లాక్‌డౌన్‌ని ఎత్తివేసిన తర్వాత ఎంఎస్ ధోనీ తన ప్లాన్స్‌పై పక్కా క్లారిటీతో ఉన్నట్లు తాజాగా సాక్షి ధోనీ వెల్లడించారు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ అధికారిక ఇన్‌స్టా లైవ్‌చాట్‌లో రూపా రమణితో సాక్షి మాట్లాడుతూ... 'లాక్‌డౌన్ తర్వాత క్రికెట్‌ ఉంటే.. ధోనీ మ్యాచ్‌లు ఆడతాడు. ఒకవేళ మ్యాచ్‌లు లేకపోతే.. నేను మహీ కలిసి మంచు కొండల్లో విహరించాలని ప్లాన్ చేసుకున్నాం. ధోనీకి మంచు అంటే మహా ఇష్టం. ఉత్తరాఖండ్‌‌లోని మంచు కొండల్లో విహరించాలని ధోనీ ఇప్పటికే ప్లాన్ చేసాడు' అని తెలిపారు.

10 నెలలుగా క్రికెట్‌కి దూరం:

10 నెలలుగా క్రికెట్‌కి దూరం:

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.

Story first published: Wednesday, June 3, 2020, 19:39 [IST]
Other articles published on Jun 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+