For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడే బుడ్డోడి చేతిలో బాదుడు కార్యక్రమం

ఐపీఎల్ 2026లో నేడు మరరో హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ తో తలపడబోతోంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గువాహటి స్టేడియం దీనికి వేదిక. మహేంద్ర సింగ్ ధోని లేని మొదటి గేమ్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కండరాల నొప్పి కారణంగా ప్రారంభ మ్యాచ్ లకు ధోని దూరం అయ్యాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కు స్పిన్ బౌలింగ్ సవాలుగా మారింది. నూర్ అహ్మద్ నాణ్యమైన స్పిన్నర్ అయినా స్పిన్ దళం బలహీనంగా ఉంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ జట్టులో లేరు. ప్రశాంత్ వీర్‌కు అనుభవం తక్కువ. రాహుల్ చాహర్, శ్రేయాస్ గోపాల్‌ ట్రాక్ రికార్డు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి టాప్ సిక్స్‌లో నలుగురు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్లు ఆడే అవకాశం ఉంది.

MS Dhoni Absence Chennai Super Kings Face Rajasthan Royals in Guwahati Showdown Key Match Preview

వారిలో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఇది సీఎస్‌కే స్పిన్నర్లకు తీవ్ర సవాలును విసరనుంది. ఈ ఏడాది నూర్ అహ్మద్‌కు లెఫ్ట్ హ్యాండర్లపై అంత మంచి రికార్డు లేదు. ఒక వికెట్ మాత్రమే తీసి 12.13 ఎకానమీని రికార్డు చేశాడు. ప్రతి 3.75 బంతులకు ఒక బౌండరీని ఇస్తూ వస్తోన్నాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్లపై ఇప్పటివరకు అయిదు వికెట్లు తీశాడు. 30.40 సగటు, 7.79 ఎకానమీ రేటుతో మెరుగ్గా ఉంది.

రాజస్థాన్ రాయల్స్ పైనా నూర్ అహ్మద్ రికార్డు బాగాలేదు. యశస్వి జైస్వాల్ 222.22, వైభవ్ సూర్యవంశీ 266.66 స్ట్రైక్ రేట్‌లతో అవుటవకుండా రాణించారు. రియాన్ పరాగ్ 165.51 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు అతని బౌలింగ్ లో. షిమ్రాన్ హెట్మెయర్ దీ అదే పరిస్థితి. నూర్ అహ్మద్ బౌలింగ్ లో 176.19 స్ట్రైక్ రేట్‌తో 42 బంతుల్లో తొమ్మిది బౌండరీలు బాదాడు.నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్ మాత్రమే కొంత ఇబ్బంది పడ్డాడు.

డెవాల్డ్ బ్రెవిస్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాథ్యూ షార్ట్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్‌తో పోలిస్తే బంతితో అతను మరింత ప్రభావవంతంగా రాణించగలడని భావిస్తున్నారు. మ్యాథ్యూ షార్ట్ కు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై మంచి రికార్డే ఉంది. 20.87 సగటుతో ఎనిమిది వికెట్లు, 6.72 ఎకానమీ రేటుతో రాణించాడు. పవర్‌ప్లేలో మ్యాథ్యూ షార్ట్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లకు బౌలింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆఫ్ స్పిన్‌కు వ్యతిరేకంగా వైభవ్ సూర్యవంశీ 42 బంతుల్లో నాలుగు సార్లు అవుటవడం షార్ట్‌కు కలిసొస్తుంది. జైస్వాల్, హెట్మెయర్‌లు స్పిన్‌ను బాగా ఆడినా, స్లోపిచ్‌లతో ఇబ్బంది పడొచ్చు. అరంగేట్రం చేయనున్న ప్రశాంత్ వీర్‌కు ఆరంభంలో ప్రతికూల మ్యాచప్‌లు ఉంటాయి. రాహుల్ చాహర్ లేదా శ్రేయాస్ గోపాల్ లలో ఎవరైనా ఆడినా ఇదే సమస్య. బౌలింగ్ లో ఎటు తిరిగి నూర్ అహ్మద్ మెరుగవ్వాలి, మ్యాథ్యూ షార్ట్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

Story first published: Monday, March 30, 2026, 11:57 [IST]
Other articles published on Mar 30, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+