Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే మ్యాచ్‌లకు గంభీర్ ఫిట్, ఎంఆర్‌ఐ స్కాన్‌ విడుదల

Gautam Gambhir
హోవ్‌ (సస్సెక్స్‌) : ఇంగ్లండ్‌తో జరగనున్న వన్‌ డే అంతర్జాతీయ (ఒడిఐ) క్రికెట్‌ మ్యాచ్‌లలో ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ పాల్గొనడంపై నెలకొన్న అనిశ్చితి దాదాపుగా తొలగిపోయింది. గంభీర్‌ ఐదు మ్యాచ్‌ల ఒడిఐ సీరీస్‌కు ఫిట్‌ కావచ్చునని భారత జట్టు మేనేజర్‌ శివలాల్‌ యాదవ్‌ బుధవారం హోవ్‌లో సూచించారు. గంభీర్‌పై జరిపిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో అవాంఛిత సమస్య ఏదీ బయటప డలేదని, దీనితో వచ్చే నెల ఒడిఐ సీరీస్‌లో అతను పాల్గొనే అవకా శాలు మెరుగయ్యాయని యాదవ్‌ చెప్పారు. అయితే, గురువారం సస్సెక్స్‌తో జరగనున్న ప్రాక్టీస్‌ గేమ్‌లో అతను ఆడకపోవచ్చునని మేనేజర్‌ సూచించారు.

ఎంఆర్‌ఐ స్కాన్‌ అనంతరం గంభీర్‌ అందుబాటులో ఉండడంపై ఊహాగానాలకు తెర పడినప్పటికీ అతను బుధవారం తన సహచరులతో కలసి ప్రాక్టీస్‌ చేయడానికి మైదానానికి రాలేదు. మరొక ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఐదు వన్‌ డే మ్యాచ్‌లలోను, ఒక ట్వంటీ20 మ్యాచ్‌లోను ఆడే అవకాశం లేక పోవడంతో జట్టు వ్యూహంలో గంభీర్‌ పాత్ర కీలకంగా మారింది. ఇటీవల లండన్‌ ఓవల్‌ మైదానంలో నాలుగవ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ కొట్టిన బంతిని పట్టుకోవడానికి మిడాన్‌లో ఉన్న గంభీర్‌ వెనుకకు పరుగెత్తుతూ కింద పడినప్పుడు గంభీర్‌ తల మొద్దుబారిపోయింది. గంభీర్‌ వెల్లకితలా పడినప్పుడు అతని తల గట్టిగా నేలకు తగల డంతో ఆ క్యాచ్‌ కూడా చేజారిపోయింది. వాస్తవానికి ప్రస్తుత సీరీస్‌ ఒకవిధంగా గంభీర్‌కు దురదృష్ట కరమైనది.

ఇక ఇది ఇలా ఉంటే ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సీరీస్‌లో 0-4 పరాభవంతో ఆత్మ విశ్వాసం కుంచించుకుపోయిన భారత క్రికెట్‌ జట్టు రానున్న ఒడిఐ మ్యాచ్‌లకు ముందుగా ముమ్మరంగా ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ సాగించింది. గాయపడిన ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌, టెస్ట్‌ సీరీస్‌లో భారత అత్యుత్తమ క్రీడాకారుడు రాహుల్‌ ద్రావిడ్‌ మినహా మిగిలిన ఒడిఐ జట్టు సభ్యులందరూ బుధవారం ఉదయం హోవ్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. భారత క్రికెటర్లు వివిధ రీతులలో క్యాచ్‌లతో సహా ఉధృతంగా ఫీల్డింగ్‌ డ్రిల్‌లో పాల్గొన్నారు. ఫీల్డర్లు బౌండరీ లైన్‌ వద్ద నిలబడి ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతులను పట్టుకొనే ప్రయత్నం చేయడం ఆసక్తిదాయకంగా ఉంది. భారత జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోని ఈ క్యాచింగ్‌ డ్రిల్‌లో పాల్గొనలేదు. అయితే, అతను నెట్స్‌లో కొంత సేపు బ్యాట్‌తో ప్రాక్టీస్‌ చేశాడు. సురేష్‌ రైనా, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కూడా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. మునాఫ్‌ పటేల్‌, వినయ్‌ కుమార్‌, ప్రవీణ్‌ కుమార్‌ బౌలింగ్‌ను వారు ఎదుర్కొన్నారు. భారత కోచ్‌ డంకన్‌ ఫ్లెచర్‌ బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్‌ సిమ్మన్స్‌తో కలసి నెట్స్‌ వెనుక నిలబడి ఈ ప్రాక్టీస్‌ను గమనించారు. బ్యాట్స్‌మన్‌లలో రోహిత్‌ శర్మ ఎక్కువ ఆకట్టుకున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+