Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంపీ కొడుకు ఊచకోత: 95 పరుగులతో విరుచుకుపడ్డ కేకేఆర్ స్టార్!

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డిపిఎల్) 2026లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ అద్భుత ప్రదర్శనతో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. బుధవారం (ఆగస్టు 5) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ విజయంలో కెప్టెన్ సార్థక్ రంజన్ హీరోగా నిలిచాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన సార్థక్ రంజన్ కేవలం 50 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో 95 పరుగులు బాదాడు. సార్థక్ రంజన్ సెంచరీకి కేవలం 5 పరుగుల దూరంలో ఔటైనా, అతని విధ్వంసకర బ్యాటింగ్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. సార్థక్ రంజన్ పూర్ణియా లోక్‌సభ ఎంపీ అయిన పప్పు యాదవ్ కుమారుడు. సార్థక్ తల్లి రంజిత్ రంజన్ కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. ఆటగాళ్లకు అది నూరిపోసిన గంభీర్!(వీడియో)

శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. ఆటగాళ్లకు అది నూరిపోసిన గంభీర్!(వీడియో)

172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ జట్టుకు ఆరంభం పేలవంగా ఉంది. ఆ జట్టు కేవలం 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ సార్థక్ రంజన్, యశ్ భాటియా బాధ్యత తీసుకున్నారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ మూడో వికెట్‌కు మ్యాచ్ గెలిపించే 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టును పటిష్టమైన స్థితిలో నిలబెట్టారు. సార్థక్ భారీ షాట్లు కొడుతుండగా.. యశ్ మరో వైపు నుంచి అద్భుతమైన సహకారం అందించాడు.

MP Pappu Yadav son Sarthak Ranjan scored 95 runs off 50 balls in DPL 2026 for North Delhi Strikers

ఫాస్ట్ బౌలర్ సిమర్‌జీత్ సింగ్ వేసిన ఒకే ఓవర్‌లో సార్థక్ రంజన్ 29 పరుగులు చేయడంతో మ్యాచ్‌లో కీలక మలుపు వచ్చింది. ఆ ఓవర్ తర్వాత మ్యాచ్ పూర్తిగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. సార్థక్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఔటైనప్పటికీ.. విజయం దాదాపు ఖాయమైంది. ఈలోగా, యశ్ భాటియా అజేయ అర్ధశతకం సాధించి 4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. యశ్ భాటియా 34 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అజేయంగా 53 పరుగులు చేశాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సుజల్ సింగ్ 50 బంతుల్లో అద్భుతమైన అజేయ 82 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. అతను 6 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టినప్పటికీ.. అతనికి మరో వైపు నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తరఫున వికాస్ దీక్షిత్ అత్యంత పొదుపైన బౌలర్‌గా నిలిచి, తన 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

డ్రింక్స్ మోయించి ఫామ్‌ కోల్పోయేలా చేశారు: మాజీ క్రికెటర్

Also Read

డ్రింక్స్ మోయించి ఫామ్‌ కోల్పోయేలా చేశారు: మాజీ క్రికెటర్

మ్యాచ్ అనంతరం కెప్టెన్‌గా తనకు ఇదే తొలి విజయమని, అందుకే ఇది తనకు చాలా ప్రత్యేకమైనదని కెప్టెన్ సార్థక్ రంజన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, "తొలి దశలోనే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత, భాగస్వామ్యాన్ని నిర్మించడంపైనే మా దృష్టి కేంద్రీకరించాం. యశ్ భాటియా వరుసగా బౌండరీలు కొట్టి మాపై ఒత్తిడిని తగ్గించాడు. ఓ కీలకమైన ఓవర్ వస్తుందని మేము నమ్మకంగా ఉన్నాం, అదే మ్యాచ్‌కు మలుపుగా మారింది" అని అన్నారు.

అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత, సార్థక్ రంజన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్‌ను అనుకరిస్తూ ఒక ప్రత్యేకమైన రీతిలో సంబరాలు చేసుకున్నాడు. తాను జొకోవిచ్‌కు పెద్ద అభిమానినని, ఆయనను గౌరవించడానికే ఈ సంబరం చేసుకున్నానని సార్థక్ రంజన్ వివరించాడు. డీపీఎల్ 2026లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌కు ఇదే తొలి విజయం. ఈ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సార్థక్ రంజన్ ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో భాగంగా ఉన్నప్పటికీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సార్థక్ ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Story first published: Thursday, August 6, 2026, 17:26 [IST]
Other articles published on Aug 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+