For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జోతిష్కుడిలా!: ఆర్టికల్ 370 రద్దుపై ఐదేళ్ల క్రితమే చెప్పాడు

Move Over Prithvi Shaw Prediction, Jofra Archer Had Spoken About ‘370’ Five Years Ago

హైదరాబాద్: జోఫ్రా ఆర్చర్‌కి ఏమైంది? ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అవుతోంది. అందుకు కారణం అతడు ట్విట్టర్‌లో చేస్తోన్న ట్వీట్లే. అయితే, జోప్రా ఆర్చర్ చేస్తోన్న ట్వీట్లు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సరిపోతుండటంతో ప్రతీసారి చర్చనీయాంశంగా మారుతున్నాడు.

ఇటీవలే బీసీసీఐ నిషేధానికి గురైన టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా గురించి జోఫ్రా ఆర్చర్ గతంలోనే ట్వీట్ చేయడంతో నెటిజన్లు అవాక్కైన సంగతి తెలిసిందే. కాగా, జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు గురించి ఐదేళ్ల క్రితమే ఆర్చర్ ట్వీట్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో సోమవారం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది.

ఆ తర్వాత జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లు 2019కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే 2014, మే 26వ తేదీన 'ఈ రోజుల్లో 370 కూడా సురక్షితం కాదు(ఈవెన్ 370 ఈజ్ నాట్ సేఫ్ దీజ్ డేస్' అంటూ ఆర్చర్ ట్వీట్ చేశాడు. ఆ రోజే తొలిసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయడం మరో విశేషం.

దీంతో నెటిజన్లు జోఫ్రా ఆర్చర్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఆర్చర్ బాబాకి జై' అంటూ ఒక వ్యక్తి ట్వీట్ చేయగా మరొక నెటిజన్ ''ఆర్టికల్ 370 గురించి ఆర్చర్ జోతిష్కుడిలా చెప్పాడు'' అంటూ ట్వీట్ చేశారు. ''అసలు ఇతను ట్వీట్ చేయని ఆంశం ఏదైనా ఉంటే దయచేసి నాకు చెప్పిండి'' అంటూ మరో వ్యక్తి ట్వీట్‌ చేశారు.

Story first published: Monday, August 5, 2019, 19:50 [IST]
Other articles published on Aug 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+