
హైదరాబాద్: స్టేడియంలో వీక్షకులు, క్రికెట్ అభిమానులు చివరికి కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న సునీల్ గవాస్కర్ సైతం నాగిని డ్యాన్స్ అనుకరించారు. నిదహాస్ ట్రోఫీలో పాల్గొన్న బంగ్లాదేశ్ జట్టు అందరికీ ఈ నాగిని డ్యాన్స్ ఫేమస్ చేసింది. దీంతో నిదహాస్ ట్రోఫీ పుణ్యమా అని నాగిని డ్యాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
టోర్నీలో భాగంగా గత వారం ఆతిథ్య శ్రీలంకతో హోరాహరీగా జరిగిన పోరులో బంగ్లాదేశ్ అనూహ్య విజయం సాధించింది. ఆ ఆనందంలో బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ నాగిని డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనికి పోటీగా హర్భజన్ సింగ్ బిచ్చూ డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
దీనికి పోటీగా బిచ్చూ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ డ్యాన్స్ వీడియో భారత స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్‌కు కూడా నచ్చిందట. ఆయన తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
'నాగిని డ్యాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో చూశాం. ఇప్పుడు మీ కోసం బిచ్చూ డ్యాన్స్‌ను పరిచయం చేస్తున్నాను. ఈ వారాంతం బాగా ఎంజాయ్ చేయండి' అని భజ్జీ పేర్కొన్నాడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి డప్పు శబ్దాలకనుగుణంగా డ్యాన్స్ చేస్తాడు. ఆ స్టెప్పులు చాలా విచిత్రంగా ఉన్నాయి.