Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనాతో భూమాతకు ఓ మార్గం దొరికింది: రోహిత్

Mother Earth has found way to heal: Rohit Sharma shares inspiring message amid Coronavirus crisis

ముంబై: మానవ జీవన శైలితో ఇన్ని రోజులు వాయు, శబ్ద కాలుష్యం ఏర్పడిందని.. కరోనా వైరస్‌ (కొవిడ్-19) వల్ల అవన్నీ తగ్గుముఖం పట్టాయని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. కరోనా భయంతో ప్రజలు తమ కార్యకలాపాలు తగ్గించుకోవడంతో ఇది సాధ్యమైందంటూ ఆదివారం ఓ ట్వీట్‌ చేశాడు. మహమ్మారి కరోనా కారణంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.

భూమాతకు ఓ మార్గం దొరికింది:

భూమాతకు ఓ మార్గం దొరికింది:

'ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిని నయం చేయడానికి భూమాత ఓ మార్గాన్ని ఎంచుకుంది. కొద్ది కాలంలోనే మన జీవనశైలిని మార్చుకునేలా చేసింది. వాతావరణ మార్పులను సరిదిద్దే చర్యలలో మనం ఎప్పుడూ అలసత్వం వహిస్తూ వచ్చాం. కానీ.. మన అందరం కలిసి చేసే పనులను రివర్స్‌ చేసి.. తనని తాను భూమాత నయం చేసుకుంటోంది' అని రోహిత్ శర్మ ట్వీట్‌ చేశాడు.

హంసలు విహరిస్తున్నాయి:

హంసలు విహరిస్తున్నాయి:

'కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో వాయు, శబ్ద కాలుష్యాల తీవ్రత తగ్గింది. వెనిస్‌ హార్బర్‌లో డాల్ఫిన్లు వాటికీ ఇష్టం వచినట్టు ఆడుకుంటున్నాయి. పందులు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. రోమ్‌ ఫౌంటైన్స్‌లో హంసలు విహరిస్తున్నాయి. కాలుష్య స్థాయి ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోయింది. ఈ ప్రపంచాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది' అని రోహిత్‌ ట్వీటాడు.

కుటుంబ సభ్యులతో ఇంట్లోనే:

కుటుంబ సభ్యులతో ఇంట్లోనే:

కరోనా కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్, ఐపీఎల్‌ వాయిదా పడడంతో రోహిత్ శర్మ ఇంట్లోనే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మెగా లీగ్‌లో రోహిత్.. ముంబైకి నాలుగు టైటిళ్లు అందించాడు. గత సీజన్‌లో తన సూపర్ కెప్టెన్సీ‌తో ఒక్క పరుగు తేడాతో చెన్నై‌ను ఓడించి ముంబైని విజేతగా నిలిపాడు. ఇంత విలువైన ఆటగాడిని కేవలం రూ.15 కోట్లకే ముంబై సొంతం చేసుకోవడం అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏది ఏమైనా ఈ సారి ఐపీఎల్ జరగకపోతే హిట్ మ్యాన్ ఈ అమౌంట్ మొత్తం కోల్పోనున్నాడు.

Story first published: Monday, March 23, 2020, 8:26 [IST]
Other articles published on Mar 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+