Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమ్మ బౌలింగ్, కొడుకు బ్యాటింగ్: వీడియోని షేర్ చేసిన క్రికెటర్ కైఫ్

Mother bowling, child batting: Kaif shares video

హైదరాబాద్: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. రూల్స్ తెలియాల్సిన పనిలేదు. తన అభిమాన క్రికెటర్ ఆడుతుంటే చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అలా టీవీకి అతుక్కుపోతారు. గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్ వరకు క్రికెట్‌ను అలానే ప్రేమిస్తారు.

తాజాగా ఓ తల్లి తన రెండేళ్ల కొడుకు కోసం బౌలర్ అవతారమెత్తి.. వీధుల్లో బౌలింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. రద్దీగా ఉన్న రోడ్డులో తన కుమారుడికి బౌలింగ్‌ చేసింది. ఆ చిన్నారి బంతిని కొట్టాక.. జడేజా మాదిరి బ్యాటును తిప్పడం ఆశ్చర్యపరిచింది.

ఇందుకు సంబంధించిన వీడియోని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ 'కొడుకు బ్యాటింగ్‌.. అమ్మ బౌలింగ్‌.. మొత్తానికి బ్యాటిఫుల్‌' అనే కామెంట్‌తో తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఇక, మహ్మద్ కైఫ్ విషయానికి వస్తే ప్రస్తుతం కామెంటేటర్‌గా టీవీల్లో కనిపిస్తున్నాడు. భారత్ తరఫున 13 టెస్టులు, 125 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 10 వేలకుపైగా పరుగులు చేశాడు. ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.

2002లో నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో యువీతో కలిసి అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కైఫ్ భారత్‌కు కప్‌ను అందించాడు. లార్డ్స్‌లో జరిగిన ఆ వన్డేలో 87 పరుగులు చేసిన కైఫ్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. భారత్‌ నాట్‌వెస్ట్‌ సిరీస్‌ గెలిచి 16 ఏళ్లు పూర్తైన రోజునే కైఫ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Tuesday, January 14, 2020, 13:35 [IST]
Other articles published on Jan 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+