Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయుడు ఎవరు?

భారత క్రికెట్ చరిత్రలో దశాబ్దాలుగా నిలిచిన కొన్ని రికార్డులు ఉన్నాయి. వీటిలో ఒకటి టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కూడా ఉంది. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా భగవత్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ నిలిచారు. బీఎస్ చంద్రశేఖర్ 52 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ జట్టుపై ఈ రికార్డును సృష్టించారు. ఆయన 1972-73లో ఇంగ్లండ్ జట్టుపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొత్తం 35 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డును గత 52 ఏళ్లుగా ఏ భారతీయ బౌలర్ కూడా అధిగమించలేకపోయారు. భగవత్ చంద్రశేఖర్ రికార్డుకు దగ్గరగా ఎవరెవరు వచ్చారో తెలుసుకుందాం.

భగవత్ చంద్రశేఖర్ రికార్డు
చంద్రశేఖర్‌ను అందరూ 'చంద్ర' అని ప్రేమగా పిలిచేవారు. బీఎస్ చంద్రశేఖర్ అసాధారణమైన లెగ్ స్పిన్ బౌలింగ్ శైలి, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ వల్ల బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడు. 1972-73లో ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో చంద్రశేఖర్ 19.11 సగటుతో 35 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌లో బీఎస్ చంద్రశేఖర్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 6/38. ఆ సమయంలో బిషన్ సింగ్ బేడి, ప్రసన్న, వెంకటరాఘవన్ వంటి గొప్ప స్పిన్నర్లతో కలిసి ఆయన ఆడేవాడు.

Most Wickets by an Indian in a Test Series A Record by BS Chandrasekhar

బీఎస్ చంద్రశేఖర్ రికార్డుకు దగ్గరగా వచ్చినవారు వీరే..
చంద్రశేఖర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయినా, ఈ రికార్డుకు దగ్గరగా వచ్చిన ఇతర భారతీయ బౌలర్లు కింద ఇవ్వబడింది:

వినూ మన్కడ్, సుభాష్ గుప్తే: భగవత్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌కు ముందు ఈ రికార్డు వినూ మన్కడ్ పేరిట ఉండేది. ఆయన 1951-52లో ఇంగ్లాండ్‌పై జరిగిన సిరీస్‌లో 34 వికెట్లు తీశారు. తర్వాత 1955-56లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సుభాష్ గుప్తే కూడా సరిగ్గా 34 వికెట్లు తీసి ఈ రికార్డును సమం చేశారు.

కపిల్ దేవ్, హర్భజన్ సింగ్: 1979-80లో పాకిస్తాన్‌తో జరిగిన 6 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో కపిల్ దేవ్ 32 వికెట్లు తీశారు. ఆ తర్వాత 2000-01లో ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో హర్భజన్ సింగ్ కూడా 32 వికెట్లు పడగొట్టారు. అదే సిరీస్‌లో హర్భజన్ హ్యాట్రిక్ కూడా సాధించారు.

రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా: 2020-21లో ఇంగ్లాండ్‌పై జరిగిన ఒక సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ 32 వికెట్లు తీశారు. అలాగే, 2024-25లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఇదే సంఖ్యలో వికెట్లు సాధించి రికార్డును సమం చేశారు.

ప్రపంచ రికార్డు
టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ రికార్డు ఇంగ్లాండ్‌ జట్టుకు చెందిన సిడ్నీ బర్న్స్ పేరిట ఉంది. సిడ్నీ బర్న్స్ 1913-14లో దక్షిణాఫ్రికాతో జరిగిన 4 మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 49 వికెట్లు తీశారు. ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.

Story first published: Thursday, August 7, 2025, 10:26 [IST]
Other articles published on Aug 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+