IPL 2025: ఫ్యాన్స్ సిద్ధమా..! - ఐపీఎల్‌లో బ్రేక్ కానీ టాప్ 10 రికార్డులివే!!
IPL 2025 KKR VS RCB: ధనాధన్ పండగ ఐపీఎల్ వచ్చేసింది. రెండు నెలల పాటు అంతులేని వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ 18వ సీజన్ సిద్ధమైపోయింది. బ్యాటర్లు విధ్వంసక బ్యాటింగ్, బౌలర్లు వీరోచిత ప్రదర్శనలు, ఫీల్డర్లు అద్భుత విన్యాసాలు చేస్తూ ఉర్రూతలూగించేందుకు రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో నమోదైన రికార్డులు ఓసారి నెమరువేసుకుందాం...
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై, చెన్నై. ఈ రెండు జట్లు చెరో ఐదు టైటిళ్లను సాధించాయి. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సీజన్ లలో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023లో టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాతి స్థానంలో మూడు టైటిళ్లతో ( 2012, 2014, 2024) కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్ లు
ఐపీఎల్‌లో క్రిస్ గేల్ అత్యధిక సిక్స్ లు బాదాడు. 357 సిక్స్ లు కొట్టాడు. ఆ తర్వాత జాబితాలో రోహిత్ శర్మ 280గా ఉన్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఆడిన క్రిస్ గేల్.. పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 175 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. బ్రెండన్ మెకల్లమ్ 158*, క్వింటన్ డి కాక్ 140*, ఏబీ డివిలియర్స్ 133*, కేఎల్ రాహుల్ 132* తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్. 205 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పియూష్ చావ్లా (192), డ్వేన్ బ్రావో (183), భువనేశ్వర్ కుమార్ (181) వరుసగా ఉన్నారు.
ఐపీఎల్‌లో ఎక్కువ క్యాచ్‌లు
ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న ప్లేయర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 114 క్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103), రవీంద్ర జడేజా (103) కొనసాగుతున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానలో కొనసాగుతున్నాడు. ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న కోహ్లీ.. ఇప్పటివరకు 8,004 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ (6,769), రోహిత్ శర్మ (6,628), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528) ఉన్నారు. ఇప్పుడు వీరిలో రోహిత్ తప్ప ఇంకెవరూ ఆడట్లేదు. కాబట్టి ఇప్పట్లో కోహ్లీ రికార్డును బ్రేక్ చేయడం కష్టం.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా ధోనీ నిలిచాడు. ఇప్పటివరకు 264* ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ (257), రోహిత్ శర్మ (257), విరాట్ కోహ్లీ (252) ఆడారు.
ఐపీఎల్‌లో అతిపెద్ద విజయాలు
ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 146 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆర్‌సీబీ వేర్వేరు జట్లపై 144, 140, 138, 130 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఐపీఎల్‌లో అత్యల్ప, అత్యధిక టీమ్ స్కోర్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆర్సీబీపై 287/3తో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. కేకేఆర్‌పై ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌటై అత్యల్ప స్కోర్ ను అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications