For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2018: వన్డేల్లో కోహ్లీదే అగ్రస్థానం, రెండో స్థానంలో కుల్దీప్

Most runs by a batsman in a year 2018 in International cricket

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది కూడా మరో అరుదైన ఘనత సాధించాడు. 2018లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డుని నెలకొల్పాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో ఇద్దరు భారత క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.

ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 1202 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా... రోహిత్ శర్మ(1030) పరుగులతో రెండో స్థానంలో నిలవగా, ఇంగ్లాండ్‌కు చెందిన జానీ బెయిర్ స్టో(1025), జో రూట్(946), బ్రెండన్ టేలర్(898) పరుగులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తంగా ఈ ఏడాది కోహ్లీ(2,653) పరుగులతో ఎవ్వరికీ అందనంత ఎత‍్తులో నిలిచాడు.

ఇక, బౌలర్ల విషయానికి వస్తే ఆప్ఘనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్(48) వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆప్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ ఈ ఏడాది వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ జాబితాలో భారత్‌కు చెందిన కుల్దీప్ యాదవ్(45), రషీద్(42), ముజీబ్ ఉర్ రెహ్మాన్(37), టెండాయ్ చాటర(30) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కాగా, బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించి ఈ ఏడాదిన టీమిండియా ఘనంగా ముగించింది. ఈ విజయంతో విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీతో కలిసి కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇది కోహ్లీకి 11వ విదేశీ టెస్టు విజయం కాగా, భారత్‌కు 150వది కావడం విశేషం.

Story first published: Monday, December 31, 2018, 18:04 [IST]
Other articles published on Dec 31, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+