ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన విదేశీ ప్లేయర్లు వీరే!
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టును మట్టికరిపించి ఆర్సీబీ వరుసగా రెండో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ లీగ్ చరిత్రలో ఎందరో విదేశీ ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో మెరిశారు. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచి అత్యధికం ఐపీఎల్ టైటిళ్లను సొంతం చేసుకున్న టాప్-5 విదేశీ ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.కీరన్ పొలార్డ్
ఈ జాబితాలో అందరికంటే అగ్రస్థానంలో వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోన అత్యధికంగా ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన విదేశీ ఆటగాడిగా పొలార్డ్ రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్ జట్టులో సుదీర్ఘకాలం కీలక సభ్యుడిగా కొనసాగిన పొలార్డ్.. తన కెరీర్‌లో ఏకంగా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. ముంబై సాధించిన అనేక విజయాల్లో ఒంటిచేత్తో మ్యాచ్‌లను మలుపు తిప్పిన ఘనత కీరన్ పొలార్డ్‌కే దక్కుతుంది.

2. లసిత్ మలింగ
శ్రీలంకకు చెందిన లెజెండరీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తన అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను వణికించిన మలింగ.. పొలార్డ్‌కు గట్టి పోటీ ఇస్తూ తన కెరీర్‌లో మొత్తం 4 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ముంబై ఇండియన్స్ సాధించిన ఐదు టైటిళ్లలో నాలుగు టైటిళ్ల విజయంలో మలింగ బౌలింగ్ విభాగంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు.
3. డ్వేన్ బ్రావో
ఈ జాబితాలో తర్వాతి స్థానంలో వెస్టిండీస్‌కు చెందిన మరో స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో నిలిచాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా, వినోదాల వీరుడిగా పేరొందిన బ్రావో తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 3 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సాధించిన పలు విజయాల్లో బ్రావో బంతితోనూ, బ్యాటుతోనూ అద్భుత ప్రదర్శన చేశాడు.
4. సునీల్ నరైన్
వెస్టిండీస్‌కు చెందిన మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు వెన్నెముకగా నిలిచిన నరైన్.. తన కెరీర్‌లో మొత్తం 3 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ కేకేఆర్ తరపున ఆడుతూ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను కట్టడి చేశాడు.
5. జోష్ హేజిల్‌వుడ్
ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ లిస్టులో ఐదో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ తరపున ఆడిన హేజిల్‌వుడ్.. ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ తాజా విజయంతో హేజిల్‌వుడ్ తన కెరీర్‌లో మొత్తం 3 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన విదేశీ ఆటగాళ్ల క్లబ్‌లో చేరిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

