Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Funny Cricket Video: క్రికెట్లో కడుపుబ్బా నవ్వించే ఘటన.. వీళ్ల కన్నా గల్లీ క్రికెట్ ఆడే పిల్లలు బెటర్

యూరోపియన్ క్రికెట్ లీగ్ (ఈసీసీ)లో విచిత్రకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆటగాళ్లు అంత ప్రొఫెషనల్ ప్లేయర్లు కారు. వారు తరచుగా మిస్టేక్స్ చేస్తుంటారు. తద్వారా గ్రౌండ్లో విచిత్రకర పరిస్థితులు, కామెడీ సిచువేషన్లు వెలుగుచూస్తుంటాయి. కొన్ని సంఘటనలు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇక ఈసీసీ టోర్నీలో భాగంగా ప్రేగ్ బార్బేరియన్స్, వినోహ్రాడి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. నాలుగు సార్లు ఔటయ్యే పరిస్థితుల్లోనూ విచిత్రంగా మూడు పరుగులు తీసి భలే కామెడీ పండించారు. ఈ రోజుల్లో మూడు పరుగులు తీయడమే గగనం.. అలాంటిది ఈజీగా మూడు సార్లు రనౌట్ అయ్యే సిచువేషన్లో మూడు రన్స్ తీయడం ఇంకా విచిత్రం.

తొలుత స్టంప్ అవుట్ మిస్సయింది

తొలుత స్టంప్ అవుట్ మిస్సయింది

ఈసీసీ టోర్నీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బ్యాటింగ్ చేస్తున్న ప్లేయర్ హిట్ చేయడానికి ముందుకొచ్చాడు. కానీ బాల్ మిస్సయింది. దాన్ని కీపర్ అందుకుంటే ఈజీగా స్టంపౌట్ అయ్యేవాడు. కానీ బంతి మిస్ అయ్యి వెనకకు వెళ్లడంతో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ రన్ కోసం పరిగెత్తాడు. స్ట్రైకర్ ఎండ్‌లో వ్యక్తి కూడా పరిగెత్తాడు. బంతి అందుకున్న కీపర్ రనౌట్ చేయడానికి స్ట్రైకర్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. అది వికెట్లను తాకకుండా ప్లేయర్‌ను తాకడంతో సైడ్‌కు వెళ్లింది.

మూడు సార్లు రనౌట్ మిస్

మూడు సార్లు రనౌట్ మిస్

ఈ క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు కీపర్ వెంటనే బంతిని అందుకుని విసిరాడు. దాన్ని బౌలర్ అందుకోలేకపోయాడు. దీంతో మొదటి రన్ అవుట్ మిస్సయింది. దీంతో రన్ పూర్తి చేసిన బ్యాటర్లు.. మరో రన్ కోసం మళ్లీ పరిగెత్తారు. బౌలర్ వెనకాలే ఉన్న బంతిని అందుకుని స్ట్రైకర్ ఎండ్ వైపు ఈజీగా రనౌట్ అయ్యే వీలుండగా బంతి విసిరాడు. ఇక ఆ బంతిని వికెట్ల పక్కకొచ్చిన ఫీల్డర్ అందుకోలేకపోయాడు. లక్కీగా రెండో సారి రనౌట్ మిస్సయి బ్యాటర్ బతికిపోయాడు. పోనీ బ్యాటర్లు రెండు రన్లతో సరిపెట్టుకోక.. ఫీల్డర్ బంతి మిస్ చేశాడని మూడో రన్ కోసం మళ్లీ పరిగెత్తారు. ఇక వెనకాలే బంతిని అందుకున్న మరో ఫీల్డర్ త్రో సరిగ్గా వేయకపోవడంతో మూడో రనౌట్ మిస్సయింది. ఈ వీడియో చూస్తుంటే గల్లీ క్రికెట్లో పిల్లలు వీళ్ల కన్నా బెటర్ అనిపిస్తుంది.

వర్షం కారణంగా ఓవర్ల కుదింపు

వర్షం కారణంగా ఓవర్ల కుదింపు

కామెంటేటర్లు సైతం ఈ మ్యాచ్‌లో ఈ ఘటనను వీక్షిస్తూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. అరే ఇదేంటీ వీళ్లు ఇలా రన్స్ తీస్తున్నారు అంటూ పగలబడి నవ్వుతూ కామెంట్రీ చేశారు. ఇక మరోవైపు వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను మూడు ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రాగ్ బార్బేరియన్స్ మూడు ఓవర్లలో 24 పరుగులు చేసింది. అయితే వినోద్రాడి జట్టు మూడు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐదు పరుగుల తేడాతో ప్రాగ్ బార్బేరియన్స్ గెలుపొందారు. ఇక ఈ ఘటన గురించి నెట్టింటా కామెంట్లు ఓ రేంజులో వస్తున్నాయి. గల్లీ క్రికెటర్లు వీళ్ల కన్న బెటర్ అని కొందరు, ఇదేం క్రికెట్ రా నాయనా అని మరొకరు.. అత్యంత ఫన్నీ మూమెంట్ ఇన్ క్రికెట్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Thursday, June 9, 2022, 18:18 [IST]
Other articles published on Jun 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+