For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: ఫ్రాంచైజీలు వదులుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే..!

most expensive players released ahead of IPL mini auction

ఐపీఎల్‌లో రిటెన్షన్లు, రిలీజులు కన్ఫర్మ్ అయిపోయాయి. ఈసారి అభిమానులందరికీ షాకిచ్చిన ఫ్రాంచైజీలు తమ తమ జట్ల నుంచి బడా బడా ప్లేయర్లను తప్పించేశాయి. ముంబై ఇండియన్స్ జట్టు కీరన్ పొలార్డ్‌ను, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్‌లను వదిలించుకుంది. ఈ క్రమంలో ఆయా జట్లు వదిలించుకున్న అత్యంత ఖరీదైన క్రీడాకారులు ఎవరో ఒకసారి చూస్తే..

కేన్ విలియమ్సన్

కేన్ విలియమ్సన్

అభిమానులతో ఎంతగానో కలిసిపోయిన డేవిడ్ వార్నర్‌పై వేటు వేసి మరీ కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా నియమించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. కానీ అతను కూడా అత్యంత పేలవంగా ఆడాడు. జట్టుకు విజయాలు అందించడంలో కూడా విఫలమయ్యాడు. దీంతో రూ.14 కోట్ల విలువైన ఈ కివీస్ సారధిని సన్‌రైజర్స్ జట్టు వదిలించుకుంది.

 మయాంక్ అగర్వాల్

మయాంక్ అగర్వాల్

కేఎల్ రాహుల్ జట్టును వీడటంతో అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ పగ్గాలు అందుకున్నాడు మయాంక్ అగర్వాల్. జట్టుతో ఎప్పటి నుంచో కలిసి ఉన్న అతను.. కెప్టెన్ అయిన తర్వాత అత్యంత చెత్తగా ఆడాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టుకు శుభారంభం అందించలేకపోయాడు. దీంతో అతన్ని పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసేసింది. అతని ధర కూడా రూ.14 కోట్లే కావడం గమనార్హం.

నికోలస్ పూరన్

నికోలస్ పూరన్

భారీ అంచనాలతో నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లు పెట్టి మెగా వేలంలో కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ యాజమాన్యం. కానీ ఆ అంచనాలను తలకిందులు చేసిన పూరన్.. సన్‌రైజర్స్‌ తరఫున పెద్దగా రాణించలేదు. ఒకటీ అరా తప్ప మిగతా అన్ని మ్యాచుల్లో చేతులెత్తేశాడు. దీంతో ఈ మినీ వేలం ముందు అతన్ని కూడా సన్‌రైజర్స్ యాజమాన్యం వదిలించేసుకుంది.

జేసన్ హోల్డర్

జేసన్ హోల్డర్

మినీ వేలానికి ముందు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్న జట్టు లక్నో సూపర్ జెయింట్స్. ఈ జట్టు మేనేజ్‌మెంట్ అనూహ్యంగా కరీబియన్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను వదిలేసుకుంది. మెగా వేలంలో రూ.8.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అతను.. లక్నో తరఫున ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకున్నా బంతితో కొన్ని మ్యాచుల్లో గెలిపించాడు.

 రొమేరియో షెఫర్డ్

రొమేరియో షెఫర్డ్

ఈసారి అత్యంత ఖరీదైన ఆటగాళ్లను వదులుకున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాదే. విలియమ్సన్‌, పూరన్‌ ఇద్దరినీ వదిలేసిన ఆ జట్టు.. అక్కడితో ఆగలేదు. వెస్టిండీస్ బౌలర్ రొమేరియో షెఫర్డ్‌ను కూడా రిలీజ్ చేసేసింది. గతేడాది మెగా వేలంలో అతన్ని రూ.7.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. ఈసారి కఠిన నిర్ణయం తీసుకొని షెఫర్డ్‌ను వదిలించేసుకుంది. అతను కూడా సన్‌రైజర్స్‌ తరఫున పెద్దగా రాణించిందేం లేదు.

Story first published: Wednesday, November 16, 2022, 11:01 [IST]
Other articles published on Nov 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+