ఐపీఎల్ చరిత్రలోనే నమోదైన చెత్త రికార్డులివే


హైదరాబాద్: మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో గత పదకొండు సీజన్లలో నమోదైన చెత్త రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే..
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐపీఎల్‌లోనే అతి తక్కువ పరుగులు
ఐపీఎల్ అంటేనే పరుగుల మోత మోగుతుంది. అలాంటిది స్టార్ ప్లేయర్లతో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) ఐపీఎల్‌లో అతి తక్కువ 49 పరుగులకే ఆలౌటై ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2017లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో తోలుతు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 132 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ కేవలం 49 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.

అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బసిల్ థంపి ఒకే స్పెల్‌లో (నాలుగు ఓవర్లు) అత్యధికంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఐపీఎల్‌లో ఒక స్పెల్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

అత్యధిక ఎక్స్‌ట్రాలు
2008 ఆరంభ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు 28 అదనపు పరుగులు ఇచ్చింది. ఇప్పటివరకు ముగిసిన పదకొండు సీజన్లలో ఏ జట్టు కూడా అన్ని అదనపు పరుగలివ్వలేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అదనపు పరుగులు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి.

అత్యధికసార్లు డకౌట్
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా హర్భజన్ సింగ్ నిలిచాడు. ముగిసిన గత పదకొండు సీజన్లలో భజ్జీ అత్యధికంగా 13 సార్లు డకౌటయ్యాడు.

అత్యధిక ఓటములు
ఐపీఎల్‌లో అత్యధికసార్లు ఓటమి పాలైన జట్టుగా ఢిల్లీ డేర్ డెవిల్స్ నిలిచింది. గత పదకొండు సీజన్లలో మొత్తం 91సార్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓడిపోయింది. మరే ఇతర జట్లు ఇన్ని ఓటములు చవిచూడలేదు. కాగా, మార్చి 23నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుని బరిలోకి దిగుతోంది. అంతేకాదు ఈ సీజన్‌లో కొత్త జెర్సీని ధరించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications