న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంబటి ఖాతాలో మరో డక్: ఓ అరుదైన లిస్ట్‌లో చోటు: ఎవరెవరు ఉన్నారంటే?

Most Ducks in IPL: Ambati Rayudu out for zero against PBKS

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా ముగిసిన ఎనిమిదింట్లో బౌలర్లదే ఆధిపత్యం కనిపించింది. మ్యాచ్‌లపై బౌలర్లు పట్టు బిగిస్తున్నారు. బ్యాల్స్‌మెన్లపై పెత్తనం చలాయిస్తున్నారు. ఐపీఎల్ వంటి టోర్నమెంట్లలో భారీ షాట్లతో విరుచుకుపడే బ్యాట్స్‌మెన్లను క్రీజ్‌లో కట్టిపడేస్తున్నారు. స్వేచ్ఛగా కదలనివ్వని పరిస్థితిని బౌలర్లు కల్పిస్తున్నారు. తమ లైన్ అండ్ లెంగ్త్ బంతులతో వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ఈ క్రమంలో నామమాత్రపు స్కోర్‌ను అందుకోవడానికి కూడా ప్రత్యర్థి జట్లు నానా తంటాలు పడుతున్నాయి.

IPL 2021 స్పెషాలిటీ ఇదే.. రివర్స్ సీన్: కొత్త ట్రెండ్: బ్యాట్స్‌మెన్లకు చుక్కలేIPL 2021 స్పెషాలిటీ ఇదే.. రివర్స్ సీన్: కొత్త ట్రెండ్: బ్యాట్స్‌మెన్లకు చుక్కలే

ముంబై వాంఖెడె స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అందుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లు శ్రమించాల్సి వచ్చింది. లక్ష్యం చేతికి అందేంత దూరంలో ఉన్న సమయంలో వరుసగా వికెట్లను కోల్పోయింది ధోనీ సేన. తేలికపాటి టార్గెట్‌‌ను ఛేదించడానికి నాలుగు వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్ డుఫ్లెసిస్, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ మొయిన్ అలీ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోతే.. ఆ మ్యాచ్ ఫలితం వేరుగా ఉండేది. చెన్నై సూపర్ కింగ్స్ పీకల్దాకా వచ్చేది.

చివర్లో 17 పరుగుల తేడాతో మూడు వికెట్లను కోల్పోవడం చెన్నై సూపర్ కింగ్స్ డగౌట్‌‌ను కొంత ఆందోళనకు గురి చేసింది. 99 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయింది ధోనీ సేన. ఛేదించాల్సిన లక్ష్యం చేతికి అందేంత దూరంలో ఉండటంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాలేదు. స్కోరు ఏ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నా పరాజయం పలకరించి ఉండొచ్చనడంలో సందేహాలు అక్కర్లేదు. అంబటి రాయుడు డకౌట్ అయ్యాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, సురేష్ రైనా డబుల్ డిజిట్ అందుకోలేకపోయారు.

ఈ క్రమంలో అంబటి రాయుడు ఓ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఎక్కువ సార్లు డకౌట్ అయిన క్రికెటర్ల లిస్ట్‌లో చేరాడు. ఇప్పటిదాకా అతను ఆడిన ఐపీఎల్ సీజన్లలో 13 సార్లు డకౌట్ అయ్యాడు. అదే లిస్ట్‌లో ముంబై ఇండియన్స్ కేప్టెన్ రోహిత్ శర్మ, అజింక్య రహానె, కోల్‌కత నైట్ రైడర్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో పాటు పార్థివ్ పటేల్ ఉన్నారు. వారందరూ 13 సార్లు చొప్పున డకౌట్ అయ్యారు. ఖాతా తెరవక ముందే పెవిలియన్ చేరారు. అంబటి రాయుడు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలం కావడం చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో ఆందోళనకు కారణమౌతోంది.

Story first published: Saturday, April 17, 2021, 8:52 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X