Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్‌లో డెడ్లియెస్ట్ బౌలింగ్ కాంబో: ప్రత్యర్థి బ్యాటర్లకు రుధిరమే

Most Deadliest bowling combo Jasprit Bumrah and Jofra Archer join hands for Mumbai Indians.
IPL 2022 : Bumrah Archer Combo..Rohit Sharma అస్త్రాలు.. MI కి తిరుగులేదు | Oneindia Telugu

బెంగళూరు: ఊహించినట్టే- ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ 15వ ఎడిషన్ వేలంపాటలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పునఃప్రారంభమైన ఈ ఈవెంట్‌లో ప్రత్యర్థి ఫ్రాంఛైజీలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ బౌలింగ్ తురుఫుముక్క జోఫ్రా అర్చర్‌ను జట్టులోకి తీసుకుంది. ఆ షాక్ నుంచి ఇతర ఫ్రాంఛైజీలు తేరుకోక ముందే ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌ను సొంతం చేసుకుంది.

ఆ ఇద్దరి కోసం రూ.16 కోట్లు

ఆ ఇద్దరి కోసం రూ.16 కోట్లు

ఈ ఇద్దరి కోసం ముంబై ఇండియన్స్ ఏకంగా 16 కోట్ల 25 లక్షల రూపాయలను ఖర్చు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సెలెక్షన్‌ను బట్టి చూస్తే.. ఇప్పటికే బలంగా ఉన్న తన బ్యాటింగ్ లైనప్‌కు తోడు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను బలోపేతం చేసుకున్నట్టు కనిపించింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. అతన్ని రిటైన్ చేసుకుందా ఫ్రాంఛైజీ. ఇప్పుడు తాజాగా- జోఫ్రా అర్చర్‌ను తీసుకుంది. బుమ్రా ఒక్కడే అనుకుంటే అతనికి అర్చర్ కూడా తోడయ్యాడు.

జోఫ్రా నిలకడగా..

జోఫ్రా నిలకడగా..

జస్‌ప్రీత్ బుమ్రా-జోఫ్రా అర్చర్ కాంబినేషన్‌కు ప్రపంచ క్రికెట్‌ను శాసించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ఇద్దరూ టీ20 స్పెషలిస్టులే. డెత్ ఓవర్లలో బ్యాటర్లను కట్టిపడేయగలరు. 2018 సీజన్‌లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు జోఫ్రా అర్చర్. ఇప్పటిదాకా 35 మ్యాచ్‌లు ఆడాడు. 46 వికెట్లను పడగొట్టాడు. 2018లో 10 మ్యాచ్‌లల్లో 15 వికెట్లు తీసుకున్నాడు. ఆ మరుసటి సీజన్‌లోనూ అదే దూకుడును కొనసాగించాడు. 11 వికెట్లను పడగొట్టాడు. 2020లో ఏకంగా 20 వికెట్లు తీసుకున్నాడు.

ఐపీఎల్ నుంచి జాతీయ జట్టుకు ఎదిగిన బుమ్రా..

ఐపీఎల్ నుంచి జాతీయ జట్టుకు ఎదిగిన బుమ్రా..

ఈ మూడు సీజన్లల్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్‌ను నమోదు చేశాడు అర్చర్. తన తొలి సీజన్‌లో 3/22, 2019లో 3/15, 2020 సీజన్‌లో 3/19 బెస్ట్ బౌలింగ్ పెర్‌ఫార్మెన్స్. 2021లో ఈ మెగా సీజన్‌కు అందుబాటులో లేడు. గాయం వల్ల దూరం అయ్యాడు. జోఫ్రా అర్చర్‌కు ఏ మాత్రం తగ్గని పదునైన బౌలింగ్ జస్‌ప్రీత్ బుమ్రాది. 2013లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన బుమ్రా.. తన సత్తాతో ఏకంగా జాతీయ జట్టులో ప్రధాన బౌలర్ స్థాయికి ఎదిగాడు. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 130 వికెట్లు తీసుకున్నాడు. 2016 నుంచి నిలకడగా రాణిస్తున్నాడు.

 రోహిత్ చేతికి అస్త్రాలు..

రోహిత్ చేతికి అస్త్రాలు..

ఇప్పుడీ ఇద్దరూ ఒకే జట్టులో చేరడం ప్రత్యర్థి జట్టు బౌలర్లకు గుండెల్లో రైళ్లు పరుగెత్తించినట్టే అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ముంబై ఇండియన్స్ కేప్టెన్ రోహిత్ శర్మకు ప్రత్యర్థులపై బౌలర్లను ఎలా ప్రయోగించాలో కొట్టిన పిండి. అలాంటి రోహిత్ చేతికి ఈ ఇద్దరూ లభించడం.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగానికి ఇక తిరుగు ఉండకపోవచ్చు. కాగా- ఈ సీజన్‌లో జోఫ్రా అందుబాటులోకి రాకపోవచ్చు. 2023లోనే అతను ఆడొచ్చని తెలుస్తోంది.

Story first published: Sunday, February 13, 2022, 19:15 [IST]
Other articles published on Feb 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+