పాకిస్థాన్ కన్నా ఇండియాకు ఒకటి తక్కువ అయింది..! ఏ దేశం తరఫున ఎంత మంది సెంచరీలు చేశారంటే..?

భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో తన తొలి వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కెరీర్లో తొలి సెంచరీ జింబాబ్వేపై సాధించిన నాలుగో ఇండియన్ బ్యాటర్‌గా కూడా గిల్ నిలిచాడు. మూడో వన్డేలో ఓపెనర్‌గా కాకుండా వన్డౌన్లో దిగిన శుభ్‌మాన్ గిల్ కేవలం 82బంతుల్లోనే సెంచరీని నమోదు చేశాడు. అతను దాదాపు చివరి వరకు క్రీజులో ఉన్నాడు. చివరి ఓవర్లో ఔటయ్యాడు. గిల్ (130పరుగులు 97బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సర్) కాస్త దూకుడుగా ఆడడంతో ఇండియా మంచి స్కోరు చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 289పరుగులు చేయగా.. ఛేదనలో జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా (115) సెంచరీతో పోరాడినా ఆ జట్టు 13పరుగుల తేడాతో ఓడిపోయింది.
41వ సెంచరీ వీరుడుగా శుభ్‌మన్ గిల్
ఇకపోతే ఈ మ్యాచ్‌లో సెంచరీ ద్వారా.. వన్డేల్లో సెంచరీ చేసిన 41వ భారత ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. వన్డేల్లో భారత్ తరఫున తొలి సెంచరీ చేసిన ప్లేయర్ కపిల్ దేవ్. 1983 వరల్డ్ కప్ టైంలో జింబాబ్వేపై కపిల్ దేవ్ 175పరుగులు చేశాడు. పాకిస్థాన్ ప్లేయర్లు 42మంది ఇప్పటివరకు సెంచరీలు చేశారు. దీంతో ఆ జట్టు కంటే భారత సెంచరీవీరుల సంఖ్య ఒకటి తక్కువయింది. ఇక వివిధ జట్ల తరఫున వన్డే అంతర్జాతీయ క్రికెట్లో ఎంత మంది ప్లేయర్లు ఇప్పటివరకు సెంచరీలు చేశారో పూర్తి లిస్టును ఓసారి గమనిస్తే..
ఏ దేశం తరఫున ఎంత మంది సెంచరీ వీరులు
ఆస్ట్రేలియా - 50
ఇంగ్లాండ్ - 47
వెస్టిండీస్ - 44
పాకిస్థాన్ - 42
ఇండియా - 41
న్యూజిలాండ్ - 40
సౌతాఫ్రికా - 30
శ్రీలంక - 30
బంగ్లాదేశ్ - 16

భారత ప్లేయర్లకు దరిదాపుల్లో ఎవరూ లేరు
ఇకపోతే వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ల లిస్టులో మాత్రం భారత ప్లేయర్ల రికార్డులకు దరిదాపుల్లో ఎవరూ లేరు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... విరాట్ కోహ్లీ (43), రికీ పాంటింగ్ (30), రోహిత్ శర్మ (29), సనత్ జయసూర్య(28) టాప్ 5లో ఉన్నారు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన వారిలో సచిన్ (49), కోహ్లీ (43), రోహిత్ (29), గంగూలీ (22), ధావన్ (17) టాప్ 5లో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications