
హైదరాబాద్: వరల్డ్‌కప్‌కు ముందు బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మొసాద్దెక్ హుస్సేన్ (52 నాటౌట్; 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు) రాణించడంతో తొలిసారిగా ముక్కోణపు వన్డే సిరీస్ ట్రోఫీని బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 24 ఓవర్లలో ఒక వికెట్‌కు 152 పరుగులు చేసింది. విండిస్ ఓపెనర్లు హోప్ (74), అంబ్రిస్ (69 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 144 పరుగులు జోడించారు. విండీస్ స్కోరు 20.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 131 పరుగులతో ఉన్నపుడు వర్షంతో ఆట నిలిచిపోయింది.
వర్షం తగ్గాక మ్యాచ్‌ను 24 ఓవర్లకు కుదించి 210 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌కు నిర్దేశించారు. వర్షం తగ్గిన అనంతరం బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ (41 బంతుల్లో 66) ధాటిగా ఆడాడు. తర్వాత క్రీజులోకి దిగిన ముష్ఫికర్ రహీమ్ (36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు, మిథున్ (17) ఉన్నంత సేపు దూకుడుగా ఆడారు.
అనంతరం మహ్ముదుల్లా (19 నాటౌట్) అండతో మొసద్దిక్ హొస్సేన్ (24 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో మరో 7 బంతులు మిగిలివుండగానే బంగ్లా ఐదు వికెట్లకు 213 పరుగులు సాధించింది. బంగ్లాదేశ్ కెరీర్‌లోనే తొలి ముక్కోణపు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.