Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రిటైరవుతా: మోర్కెల్ సంచలన నిర్ణయం

Morne Morkel to retire after series against Australia

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ అనంతరం క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. డర్బన్ వేదికగా మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు.

'ఇది చాలా కఠినమైన నిర్ణయం. అదే సమయంలో ఇది ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభించేందుకు సరైన సమయం. ఈ అంతర్జాతీయ షెడ్యూల్‌ల వల్ల నాపై చాలా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో నా కుటుంబంతో సమయం గడపలేకపోతున్నా. సఫారీ జెర్సీలో ఆడిన ప్రతి క్షణం నేను ఎంజాయ్ చేశా' అని అన్నాడు.

'క్రికెట్ దక్షిణాఫ్రికా, నా కుటుంబం, మిత్రులు ఇన్నాళ్లుగా నాకు చాలా మద్దతుగా నిలిచారు. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలుందని భావిస్తున్నా. నా శక్తిని, ప్రతిభని రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో ఉపయోగించి.. జట్టు విజయాన్ని కట్టబెట్టాలని నేను అనుకుంటున్నా' అని మోర్కెల్ తెలిపాడు.

33 ఏళ్ల మోర్కెల్ దక్షిణాఫ్రికా తరుపున ఇప్పటివరకు 83 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లాడాడు. మోర్కెల్ 2006లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్ట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. 83 టెస్టులాడిన మోర్నీ మోర్కెల్ 28.08 యావరేజితో 294 వికెట్లు తీసుకున్నాడు.

మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మోర్నీ మోర్కెల్ 6 వికెట్లు తీసినట్లైతే దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో ఇప్పటివరకు షాన్ పొల్లాక్, డేల్ స్టెయిన్, ఎన్తీని, అలెన్ డొనాల్డ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

Story first published: Monday, February 26, 2018, 17:50 [IST]
Other articles published on Feb 26, 2018
Read in English: Morne Morkel to retire
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+