Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీలకు షాక్: ఉన్నపళంగా జట్టు నుంచి తప్పుకున్న మోర్కెల్

హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఆరు వారాల పాటు జట్టుకు దూరం కానున్నట్లు టీమ్ మేనేజర్, డాక్టర్ మొహ్మద్ ముసాజీ తెలిపారు. ఉదర సంబంధిత నొప్పితో బాధపడుతున్న మోర్కెల్ ఉన్నపళంగా జట్టు నుంచి తప్పుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన తొలి టెస్టులో ఆదివారం నాలుగో రోజు ఆటలో 5.2 ఓవర్లు ముగిసిన తరువాత మోర్కెల్ ఉన్నట్టుండి మైదానం నుంచి వదిలి వెళ్లిపోయాడు. 'ప్రస్తుతం మోర్కెల్ ఉదర సంబంధమైన నొప్పితో బాధపడుతున్నాడు. అతనికి నాలుగు వారాల నుంచి ఆరు వారాల వరకూ విశ్రాంతి అవసరం' అని ముసాజీ తెలిపారు.

Morne Morkel faces six weeks out with abdominal tear

మోర్కెల్‌కు స్కానింగ్ చేయించిన తర్వాత ఈ విషయం తెలిసిందని, దీంతో అతడు బంగ్లాదేశ్ పర్యటనకు దూరం కానున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ముగ్గురు దక్షిణాఫ్రికా పేసర్లు గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

డేల్ స్టెయిన్, వెర్నన్ ఫిలాండర్, క్రిస్ మోరిస్‌లు గాయాలు కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మోర్నీ మోర్కెల్ కూడా చేరాడు. అక్టోబర్ 6(శుక్రవారం) నుంచి జరిగే రెండో టెస్టులో మోర్కెల్ స్ధానంలో తుది జట్టులోకి డేన్ పాటర్సన్‌ను తీసుకోనున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+