Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా తప్పుకోవడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

Eoin Morgan Says No Decision Yet On Future After England World Cup Win || Oneindia Telugu
Morgan Says No Decision Yet on Future After England World Cup Win

హైదరాబాద్: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్‌గా కొనసాగాలా వద్దా అనే విషయంపై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌మోర్గాన్‌ అన్నాడు. 32 ఏళ్ల మోర్గాన్ తాజాగా బీబీసీ స్పోర్ట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో 2023 ప్రపంచకప్‌ వరకూ కెప్టెన్‌గా వ్యవహరించాలంటే అది పెద్ద ఒప్పందం అవుతుందని తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌ మైకం నుంచి ఇంకా

ప్రపంచకప్‌ మైకం నుంచి ఇంకా

"ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో నేను లేను. ప్రపంచకప్‌ మైకం నుంచి ఇంకా బయటపడకపోవడమే అందుకు కారణం" అని ఇయాన్ మోర్గాన్‌ చెప్పాడు. ఇప్పటివరకూ శారీరకంగా, మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యానని, కొద్దినెలల్లో అన్ని కుదురుకున్నాక ఏదైనా నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.

2015 ప్రపంచకప్‌లో

2015 ప్రపంచకప్‌లో

2015 ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజిలోనే ఇంగ్లాండ్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇయాన్‌ మోర్గాన్‌‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం... అతడి సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు నంబర్‌ వన్‌ జట్టుగా అవతరించింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌ వరకూ చేరి విండీస్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

తొలిసారి విశ్వవిజేతగా

తొలిసారి విశ్వవిజేతగా

కాగా, ఇటీవలే స్వదేశంలో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. త్వరలో ప్రారంభమయ్యే యూరో టీ20 స్లామ్ టోర్నీలో ఇయాన్ మోర్గాన్ డబ్లిన్‌కు చెందిన ప్రాంఛైజీకి సారథ్యం వహించనున్నాడు. ఈ టోర్నీలో ఐర్లాండ్, నెదర్లాండ్, స్కాట్‌లాండ్ మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి.

Story first published: Saturday, July 20, 2019, 10:31 [IST]
Other articles published on Jul 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+